మీడియా వాడకంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా.. ఆ విషయంలో ఎలాంటి వివాదం లేదు. దీన్ని తప్పని చెప్పే సాహసం ఎవరూ చేయరు. అందులోనూ చంద్రబాబు తుమ్మినా దగ్గినా హైలెట్ చేసే.. అనుకూల మీడియా గణం ఉండటం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. మిగిలిన మీడియా సంగతి ఎలా ఉన్నా.. ఓ మూడు టీవీ ఛానల్లు, ఓ రెండు పత్రికలు మాత్రం ఆయన బాగా పత్రికలుగా ముద్రపడ్డాయి.

 

అందుకే ఎంత రెచ్చగొట్టినా జనం పెద్దగా స్పందించిన అమరావతి ఉద్యమాన్ని విస్తరించే క్రమంలో చంద్రబాబు తన అనుకూల మీడియాను విపరీతంగా వాడేస్తున్నారు.

అమరావతి ఉద్యమానికి ఊపు తెచ్చేందుకు ఆయన విజయవాడలో మంగళవారం రాత్రి హైడ్రామా నడిపించారు. పాదయాత్ర పేరుతో చంద్రబాబునాయుడు బుధవారం విజయవాడలో హడావుడి చేశారు. బెంజ్ సర్కిల్ వద్ద ర్యాలీ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు.

 

విజయవాడలోని బెంజ్ సర్కిల్ నుంచి ర్యాలీగా ఆటోనగర్ వరకూ పాదయాత్రగా వెళ్లేందుకు చంద్రబాబు యత్నించారు. అయితే ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు.

ఇక్కడే పసుపు నాయకుల చాణక్యం కొత్త పుంతలు తొక్కింది. ఏకంగా పోలీసు వ్యాను తాళాలు తీసుకుని కొందరు పరారయ్యారు. మరోవైపు ఎల్లో మీడియాగా పేరున్న టీవీ ఛానళ్లు దీన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేశాయి.

 

టీడీపీ నాయకులు పోలీసు వ్యాన్‌ తాళం దొంగిలించడమే కాకుండా.. తమ నేతను అరెస్ట్‌ చేస్తారా అంటూ వాగ్వాదానికి దిగారు. చంద్రబాబును అరెస్ట్‌ చేస్తున్నారు.. బెంజ్‌సర్కిల్‌కు రావాలంటూ టీడీపీ ఆఫీస్‌ నుంచి కార్యకర్తలకు మెసేజ్‌లు పంపి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు బెంజ్‌సర్కిల్‌ వద్దకు వచ్చి గంటపాటు హడావుడి చేశారు.

 

చంద్రబాబుకు తాళం వేసే టీవీ ఛానళ్లు ఏదో జరిగినట్లు హడావిడి చేశాయి. ఈ మొత్తం వ్యవహారంతో అసలే వాహనదారులకు నరకం చూపే విజయవాడ ట్రాఫిక్ నగర వాసులకు మరోసారి చుక్కలు చూపించింది. మరి ఎల్లో మీడియానా మాజాకా..?

మరింత సమాచారం తెలుసుకోండి: