తాననుకున్నది చేయడం కోసం జగన్మోహన్‌రెడ్డి ఎంతకైనా తెగిస్తాడని, అందులో భాగంగానే రాజధానిని తరలిస్తున్నాడని, దానిఅమలుకోసం విలువలు, విశ్వసనీయత లేని రెండు బోగస్‌కమిటీలను ఆయన నియమించాడని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు.  తమమాట వింటాడు.. చెప్పింది చేస్తాడనే జగన్‌ప్రభుత్వం జీ.ఎన్‌.రావు సారథ్యంలో కమిటీ వేసిందని, ఆకమిటీ పనికిమాలిన దొంగనివేదిక ఇచ్చిందని వర్ల తేల్చిచెప్పారు. అజయ్‌కల్లం  చెప్పాడు... తాను చేశానని జీ.ఎన్‌.రావే ఒప్పుకున్నాడని రామయ్య తెలిపారు. 

 

ప్రభుత్వం నియమించిన జీ.ఎన్‌.రావు కమిటీకి ఏవిధమైన చట్టబద్ధత ఉందో, ఆకమిటీసభ్యుడైన జీ.ఎన్‌.రావుకి ఎలాంటి అనుభవముందో, ఆయన ఏఏప్రాంతాల్లో తిరిగి, ఎవరిని ప్రశ్నించి అభిప్రాయాలు సేకరించారో తెలియదన్నారు. జీ.ఎన్‌.రావు కమిటీకి ప్రభుత్వం ఎంతిచ్చిందో తెలియదుగానీ, సభ్యత, సంస్కారాలు, అవగాహనలేకుండా నివేదిక ఇవ్వడంద్వారా జీ.ఎన్‌.రావు ఐదున్నరకోట్లమంది ప్రజల్లో చిచ్చురేపాడన్నారు.  శివరామకృష్ణన్‌ కమిటీ రాష్ట్రమంతా పర్యటించిందని, ప్రజలు, మేథావులు, అధికారులు, ఎన్జీవోలు, ఇతరవర్గాల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించిందన్నారు. 

 

మరో  వైపు బోస్టన్‌గ్రూప్‌ని తెరపైకి తీసుకొచ్చారని, రాష్ట్రాల అభివృద్ధి, రాజధానుల తరలింపు పై ఆగ్రూప్‌కి ఉన్న అనుభవమేమిటో తెలియదని రామయ్య స్పష్టంచేశారు. బోస్టన్‌ గ్రూప్‌తో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని, విషయం చివరివరకు తెలియక మంత్రి బొత్స కూడా నోరెళ్లబెట్టాడని వర్ల తెలిపారు. పోర్చుగల్‌ పోలీసులు రైడ్‌చేసిన, ఎఫ్‌బీఐ   నిఘాలో ఉన్న, 100మిలియన్‌పౌండ్ల అవినీతికి పాల్పడిన పనికిమాలిన గ్రూప్‌కి రాష్ట్రప్రజల భవిష్యత్‌ను అప్పగించడం ద్వారా, జగన్మోహన్‌రెడ్డి ప్రజల జీవితాలతో చెలగాటమాడాడన్నారు. 

 

ఆయనకు ప్రజలు అధికారమిచ్చింది ఇందుకేనా అని వర్ల ప్రశ్నించారు. బోస్టన్‌కన్సల్టింగ్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ భట్టాచార్య, రోహిత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడని, రోహిత్‌రెడ్డి విజయసాయిరెడ్డికి అల్లుడని రామయ్య స్పష్టంచేశారు. ఏ2కి సాయం చేయడంకోసం ఏ1 ఈగ్రూప్‌ని తెరపైకి తీసుకొచ్చాడని, రోహిత్‌రెడ్డికి చెందిన అరబిందోఫార్మా కంపెనీ భూముల్లోనే (విశాఖపట్టణం) రాజధాని రాబోతుందని , జీ.ఎన్‌.రావు చెప్పిందే, బోస్టన్‌గ్రూప్‌ నివేదికలో కూడాఉందన్నారు. రాజధాని ఈశాన్యంలో ఉంటే... జగన్‌ జైలుకెళ్లడా...?

 

రాజధాని ఈశాన్యంలో ఉంటే జైలుకెళ్లకుండా ఉంటాడని, ఎవరోస్వామీజీ జగన్‌కు చెప్పాడని, జన్మత: క్రైస్తవుడైన జగన్‌ జాతకం మారుతుందని, హిందువైన స్వామీజీ ఎలా చెప్పాడో, ఆయన దాన్నెలా నమ్ముతున్నాడో తెలియడంలేదని వర్ల ఆశ్చర్యపో యారు. ధర్మప్రబోధకులైన స్వామీజీలు జైలుపక్షులను ఎలా సమర్థిస్తారన్నారు. సదరుస్వామీజీ  తానేం చెప్పాడో.. జగన్‌కు ఎలా అర్థమైందో, ప్రజాగ్రహం చవిచూ డకముందే ఆయనే వివరణ ఇవ్వాలన్నారు. 11కేసుల్లో ముద్దాయిగాఉన్న వ్యక్తుల్ని ఆలింగనం చేసుకున్నప్పుడే సదరు స్వామీజీ ప్రజల్లో గౌరవం కోల్పోయాడన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా రేగిన రాజధాని మంటలను ఆర్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉందని, ఇప్పుడు చిన్నమంటలా ఉన్నప్పటికీ అదే భవిష్యత్‌లో రాష్ట్రాన్ని దహించివేస్తుం దనే విషయం గ్రహించాలని వర్ల సూచించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: