ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని రగడ తారాస్థాయికి చేరుకుంటోంది.  రాజధానిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద బైఠాయించారు.  ఇలా బైఠాయించి నిరసనలు తెలియజేయడంతో బాబును పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి బలవంతంగా పోలీస్ వ్యానులో తరలించారు.  దీంతో అక్కడ అలజడి నెలకొన్నది.  బాబుతో పాటుగా కొంతమంది నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  


కాగా, దీనిని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు.  అరెస్ట్ చేస్తే భయపడిపోమని, రాజధానిని తరలించేందుకు వీలులేదని పట్టుబట్టారు.  దీంతో బాబు చాలాపెద్ద అక్కడ పెద్ద ఎత్తున ఉద్రితికతరమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.  ఇక ఇదిలా ఉంటె,  బాబుపై వైకాపా నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.  బాబును ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించాలని, ఇప్పటికే తెలంగాణ బాబును బహిష్కరించిందని అందుకే పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నా హైదరాబాద్ ను వదిలి విజయవాడ వచ్చారని అన్నారు.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా బహిష్కరిస్తే దేశంలో ఎక్కడా ఉండలేడని అన్నారు.  ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.  

 

ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఈ మూడు ప్రాంతాలూ ముగ్గురు అన్నదమ్ములు అనుకుంటే ఒకరికి హైకోర్టు, ఒకరికి సచివాలయం ఇస్తే చంద్రబాబుకు ఏంటి నష్టం. విజయవాడ ప్రజలకు విశాఖపట్నం ఎంతదూరమో, విశాఖపట్నం ప్రజలకు విజయవాడ అంతే దూరం కదా? అసెంబ్లీ సమావేశాలకు మేం గతంలో హైదరాబాద్‌ వెళ్లిన వాళ్లమే కదా? ఇప్పుడు విజయవాడకూడా వస్తున్నాం కదా? అలాగే కర్నూలు విజయవాడకు ఎంతదూరమో, విజయవాడకు కర్నూలు కూడా అంతే దూరం కదా? మరి కర్నూలుకు హైకోర్టు ఇవ్వాలని ప్రతిపాదన చేస్తే ఎందుకు ఏడుపు. ఈ అన్యాయాన్ని ఈ రోజు సరిదిద్దకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా ప్రాంతాలు ఎలా రగులుతాయి? అక్కడ ఎలాంటి ఉద్యమాలు వస్తాయన్న బుద్దీ, జ్ఞానం కూడా చంద్రబాబుకు లేదని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

 

 
ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు సీరియస్ అవుతున్నారు.  పరిపాలన చేయమని 151 సీట్లు ఇస్తే వైకాపా చేస్తున్నది ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.  ఇలాంటి పరిపాలన వలన దేశం నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.  ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎప్పుడు ఊహించలేదని అన్నారు.  ఈ పరిస్థితులు ఇలానే ఉంటె నష్టం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: