వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రైతులముసుగులో దాడి జరిగిందని, చంద్రబా  బే తనపార్టీవారితో ఆ దాడిచేయించారని వైసీపీనేతలు చెప్పడం విచిత్రంగా ఉందని వార్ల రామయ్య పేర్కొన్నారు.  పిన్నెల్లిపై జరిగిన దాడిని స్టేజ్‌మేనేజ్డ్‌ డ్రామాగా అభివర్ణించిన రామయ్య, రాష్ట్రమంత్రి, మరోనేత వాహనాలను పక్కనుంచి పంపినపోలీసులు, పిన్నెల్లి వాహనాన్ని మాత్రం రైతులమధ్యకు పంపడం పలుసందేహాలకు తావిస్తోందన్నారు. పిన్నెల్లి అక్కడకు వెళ్లాలి..  దాడి జరగాలి.. తరువాత ముఖ్యనేతలను అరెస్ట్‌చేసి, ఉద్యమాన్ని అణచివేయాలన్న ఉద్దేశంతో, హిట్లర్‌ చెప్పినట్లుగానే రాష్ట్రప్రభుత్వం నడుచుకుందన్నారు. 

 

రాజ్యాంగంలో నిరసనతెలిపే హక్కు అందరికీ ఉందన్న డీజీపీ, ముఖ్యమంత్రి,  రైతులకు కూడా ఆ హక్కులు ఉంటాయని ఎందుకు తెలుసుకోవడంలేదన్నారు. పులివెందుల వ్యక్తికి రైతుల ఆందోళనలో ఏంపనని, జగన్‌కు అనుంగు అనుచరుడైన, వైసీపీ యువతవిభాగంలో  కీలకమైన జగన్‌షరీఫ్‌ అనేవ్యక్తి చినకాకాని ఎందుకొచ్చాడో, రైతులమధ్యకు చేరి, పిన్నెల్లి వాహనాన్ని ఎందుకు అడ్డుకున్నాడో, ఎందుకు రాళ్లు రువ్వాడో జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. పులివెందుల నుంచి వచ్చిన వ్యక్తి అక్కడికెలా వచ్చాడో.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన దాడికి అతడే మూలసూత్రధారని రామయ్య తేల్చిచెప్పా రు. 

 

జగన్‌ షరీఫ్‌ ఎవరు.. అతని పూర్తి వివరాలేమిటో.. అతను పిన్నెల్లి వాహనాన్ని ఎందుకు అడ్డగించాడో.. పూర్తి వివరాలు రాబట్టాల్సిన బాధ్యత రాష్ట్రహోంమత్రిపైనే ఉందన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి వ్యాఖ్యలున్నాయన్నారు. తనపార్టీ నేతలైన కొడాలినాని, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రోజా, మల్లాది విష్ణు, ధర్మాన కృష్ణదాస్‌ల   బూతుపురాణం విన్నాక, అంబటి ఇతరులకు నీతివాక్యాలు చెప్పాలన్నారు. మంత్రిగా ఉండి లుచ్చా గాడు.. సన్నాసిగాడు అంటూ కొడాలి వాడిన బూతుపురాణం, విలేకరులను దూషిస్తూ అరేయ్‌.. ఒరేయ్‌.. కొడకా, చెప్పరా గాండూ అంటూ, కోటంరెడ్డి వల్లించిన బూతులు, రోజా, టీడీపీ మహిళానేతను ఉద్దేశించి మల్లాదివిష్ణు వాడిన అసభ్యపదజాలం అంబటి చెవికెక్కలేదా..లేక వినపడనట్లుగా నటిస్తున్నారా అని వర్ల నిలదీశారు. సభ్యత , సంస్కారం ఎవరికున్నాయో, ఎవరికి లేవో ఇప్పటికైనా రాంబాబు తెలుసుకోవాలన్నారు    

మరింత సమాచారం తెలుసుకోండి: