పూర్వకాలంలో మనుషులు తమ మనుగడ కోసం మాత్రమే సాటి ప్రాణులను చంపి జీవించే వారు. నేటి కాలంలోని మనుషులు అన్ని సుఖాలు అందుబాటులో ఉన్న, తమలో పుట్టే విపరీత బుద్ధివలన వినాశనాన్ని తెచ్చుకుంటున్నారు. ఈ కాలంలో సాటి మనిషి ప్రాణం ఓ ఉల్లిని కోసినంత ఈజీగా తీస్తున్నారు. కనీసం ఉల్లిని కోసినప్పుడైనా కన్నీళ్లు వస్తాయి. కానీ మనిషి ప్రాణం తీసేటప్పుడు ఒక్క చుక్క కన్నీరుకూడా బయటకు రావడంలేదు ఇలాంటి కిరాతకులకు. అంటే వారి హృదయాలు ఎంత కఠినంగా మారాయో అర్ధం అవుతుంది. మనుషులు అని చెప్పుకుంటూ మరమనుషుల్లా బ్రతుకుతున్నారు.

 

 

ఇకపోతే నిర్భయ కేసులో నలుగురు దోషులను ఈ నెల 22 న అధికారులు ఉరి తీయనున్నారని తెలిసిందే. ఇక వీరిని ఉరి తీసే తలారుల గురించి పెద్ద చర్చ జరుగుతుంది. అసలు వారు ఎవరు…? వారికి ఇచ్చే జీతం ఏంత..? తలారులు ఏ రాష్ట్రాల్లో ఉన్నారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం నిర్భయ దోషులను పవన్ అనే తలారి ఉరితీస్తాడని సమాచారం. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే అధికారిక తలారులు ఉన్నారు. నటా మాలిక్ అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్ తలారిగా పని చేయగా రికార్డుల ప్రకారం అతడు 25 మందిని ఉరి తీశాడు. నటా మాలిక్‌కు నెలకు రూ.10వేల జీతం చెల్లించేది రాష్ట్ర ప్రభుత్వం. ఉరి తీసిన ప్రతి సారి రూ.5000-10000 భత్యం అదనంగా ఇచ్చేవారు.

 

 

ఇక మాలిక్ అనే తలారి 2008 లో మరణించడంతో ఆయన స్థానంలో ఆయన కుమారుడు మెహ్తాబ్ వచ్చారు. నటా మాలిక్‌కు ముందు అతడి తండ్రి, తాత కూడా తలారులుగా చేసారు. ఇక మీరట్‌కు చెందిన పవన్ ఉత్తరప్రదేశ్ తలారిగా ఉన్నారు. పార్ట్‌టైమ్ పనిచేసే ఆయనకు ప్రభుత్వం నెలకు రూ.3వేల జీతం ఇస్తుంది. 1960ల్లో యూపీ అధికారిక తలారిగా అహ్మదుల్లా అనే వ్యక్తి పని చేసారు. ఈయనకు 1965 వ సంవత్సర సమయంలో ఒక్క ఉరిశిక్షకు కేవలం రూ.25 చెల్లించేవారట.

 

 

26/11 ముంబై పేలుళ్ల దోషి, పాకిస్తాన్ టెర్రరిస్టు అజ్మల్ కసబ్‌ను బాబు అనే తలారి ఉరి తీయగా అతనికి అప్పుడు 5 వేలు ఇచ్చారని తెలిపారు.. వీళ్లే కాకుండా టెర్రరిస్ట్ యాకుబ్ మెమన్‌ను కూడా అతనే ఉరి తీసాడట. అయితే వీరి వివరాలను వారి వ్యక్తిగత భద్రత దృష్ట్యా అధికారులు బయటపెట్టలేదు. నిజంగా తలారి వృత్తి కౄరమైనదే కాని అది కూడా ఉద్యోగ నిర్వహణలో ఒక భాగమే. ఇకపోతే జాలి పడేవారు ఈ వృత్తికి పనికి రారనే అభిప్రాయం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: