ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. పేద ప్రజలందరికీ మెరుగైన విద్య వైద్యం అందించడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. తన పరిపాలనతో పొరుగు రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు. అటు ప్రజల్లో కూడా మాకు ఏ కష్టం వచ్చినా ముఖ్యమంత్రి జగన్ అన్న ఉన్నాడు అనే ధీమాను  కలిగిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వస్తే రాజన్న పాలన వస్తుందని నమ్మిన ప్రజలందరికీ అంతకుమించిన పాలనే అందిస్తున్నారు  జగన్మోహన్ రెడ్డి. ఎన్నో వినూత్న పథకాలు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 

 

 

 నాటి తరం ఆలోచనలతో కాకుండా నేటి యువతరం ఆలోచనలతో పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేద విద్యార్థులందరికీ మెరుగైన విద్య అందించడం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ వచ్చారు ఈ క్రమంలోనే  అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని ఏ  పేద కుటుంబంలో కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో... ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థికి ప్రతి ఏటా 15 వేల రూపాయల చొప్పున తల్లిదండ్రులకు చేయూతనిచ్చేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. అమ్మఒడి పథకం ద్వారా పేద కుటుంబంలోని ఒక విద్యార్థికి 15 వేల రూపాయలు అందించేందుకు నిర్ణయించి... నిర్ణీత చేయూత డబ్బులను విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేసేందుకు నిర్ణయించింది జగన్మోహన్రెడ్డి సర్కార్. 

 

 

 కాగా నేడు అమ్మ ఒడి పథకాన్ని చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రారంభించనున్నారు. దీంతో ఈ పథకానికి అర్హత సాధించిన 43 లక్షల మంది విద్యార్థుల తల్లుల  ఖాతాలో నేడు 15 వేల రూపాయలు జమ కానున్నాయి. మొదట ఈ పథకాన్ని 1 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయించగా...  ఆ తర్వాత మరోసారి పునరాలోచించి ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు మెరుగైన విద్యను పొందేందుకు వీలుంటుంది. ఈ పథకం పొరుగు రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: