ఈ మందు బాబులకు మద్యం కనిపిస్తే చాలు లోకం అంత మర్చిపోతారు. ఎంత మద్యం పిచ్చి ఉంటె మాత్రం.. కనీసం అది మీరు అనుకున్నట్టు మద్యం ఆ కదా అనేది కూడా తెలియదా ? అంత స్పృహ కూడా లేకుండా తాగుతారా ? మనుషులేనా అసలు. సరే లెండి ఈ మందుబాబుల గురించి ఎంత మాట్లాడుకున్న వేస్ట్ ఏ.. ఎందుకంటే మందుబాబులకు మనం ఎన్ని సార్లు మాట్లాడుకున్న ఒకటే.. 

 

ఇంకా అసలు వివరాల్లోకి వెళ్తే.. మొన్నటికి మొన్న ఓ మందుబాబు.. మద్యం అనుకోని యాసిడ్ తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు.. ఇప్పుడు మరో మందుబాబు.. మద్యం అనుకుని అప్పటికే మద్యం తగిన మత్తులో ఉన్న వ్యక్తి పురుగులమందు తాగేసి ఆస్పత్రిపాలై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం వెన్నంపల్లిలో జరిగింది. 

 

వెన్నంపల్లి గ్రామానికి చెందిన మిల్కుల గట్టయ్య అనే 46 ఏళ్ళ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. డిసెంబర్ 29వ తేదీన కాస్త మద్యం తాగిన గట్టయ్యకు ఇంకా తాగాలనిపించింది. మద్యానికి డబ్బులు లేకపోవడంతో ఇంట్లోని సీసాల్లో కొంచెమైనా మద్యం దొరుకుతుందేమోనని వెతికాడు. ఆ సమయంలో పురుగు మందు పోసి ఉన్న సీసా కనిపించడంతో అది మద్యం అనుకొని తాగేశాడు. 

 

కాసేపటికే నురగలు కక్కుకోవడంతో కుటుంబసభ్యులు అతడిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆలా ఎలా అనుకోని తాగవు అయ్యా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా మృతుడు గట్టయ్య భార్య సరోజ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: