ఈ మధ్య ట్రాఫిక్ జరిమానాలు భారీగా పెరిగి పోయిన విషయం తెలిసిందే. భారీగా పెరిగిపోయిన ట్రాఫిక్ జరిమాణాలతో  ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. దీంతో వాహనాలు ఎంత జాగ్రత్తగా నడిచినా కొన్ని కొన్ని సార్లు ట్రాఫిక్ జరిమానాలు పడుతూ ఉంటాయి. పోలీసులకు దొరికిపోతూ  ఉంటాము. ట్రాఫిక్ జరిమానాలు పడిన తర్వాత అది చూసి అవాక్కవడం వాహనదారుల వంతవుతుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఎన్నో సార్లు వాహనాలకు జరిమానాలు పడడం ఎన్నో చూశాము  కూడా. ఇక ఇప్పటి వరకు పడిన జరిమానాలు చూసి వామ్మో ఇంత మొత్తంలో జరిమానాలా ... ఎలా కట్టగలం బాబోయ్ అని అనుకొని వాళ్ళు ఉండరు. ఇక  రోజురోజుకూ ట్రాఫిక్ పోలీసులు కూడా బాగా అలెర్ట్  అయిపోతున్నారు. 

 

 

 ట్రాఫిక్ నిబంధనలు ఎక్కడా అతిక్రమించిన  జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు ఎంత అలర్ట్ గా ఉంటున్నారో...  అంతకుమించిన అలర్ట్ గా ఉంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా నిబంధనలు అతిక్రమించ కుండా ఎంత ఉండాలని ప్రయత్నించినా కొన్ని కొన్ని సార్లు పోలీసులకు దొరక్క తప్పడం లేదు. భారీ జరిమానాలు కట్టక తప్పడం లేదు. దీంతో వాహనదారులు అందరూ భారీ జరిమానా లతో బెంబేలెత్తిపోతున్నారు. ఇకపోతే ఇక్కడ ఓ కారుకి  జరిమానా పడింది... ఇంతకీ జరిమానా ఎంత అనుకుంటున్నారా.. ఏకంగా 27 లక్షల రూపాయలు. 

 

 

 వామ్మో 27 లక్షల రూపాయల జరిమానానా ... అదెలా సాధ్యం అంటారా... అది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. గుజరాత్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ లోని రెండు కోట్ల విలువైన పోర్షే 911 స్పోర్ట్స్ కార్ పై ఏకంగా 27.68 లక్షల ఫైన్ పడింది. గత ఏడాది సరైన పత్రాలు చూపించక పోవడంతో నవంబర్ నెలలో... 9.80 లక్షల జరిమానా విధించారు పోలీసులు. ఇక తాజాగా ఆ మొత్తాన్ని 27.68 లక్షలకు పెంచారు స్థానిక ఆర్డిఓ. మోటార్ బాలెన్స్ టాక్స్ దానిపై వడ్డీ, పెనాల్టీ రూపంలో మొత్తంగా 27.68 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించారు అధికారులు.  కాగా  దేశంలోని అత్యధిక జరిమానాలలో  ఇది ఒకటి అని గుజరాత్ పోలీసు శాఖ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: