2012 సంవత్సరంలో 23 ఏళ్ల యువతిపై అత్యాచారం అత్యాచారం చేసి యువతి మర్మాంగాలలోకి  పదునైన వస్తువులు జొపించడంతో యువతి మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆరుగురు నిందితులు ఉండగా ఒక నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు ఇక ఇంకో నిందితుడు జైలులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కేసు లో ఉన్న నలుగురు నిందితులకు కోర్టు ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే. వారికి డెత్ వారంట్ జారీ చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నలుగురు నిందితులను ఈ నెల 22న ఉరి తీయనున్నారు దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ నెల 22వ తేది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అంటూ నిర్భయ నిందితులకు ఉరి తీసే తలారి పేర్కొన్నారు ఆరోజు కాకుంటే మరుసటి రోజు నన్ను ఇక్కడినుంచి తీహార్ జైలుకు తీసుకొని వెళ్తారు. నాకు ఇప్పుడు డబ్బులు అవసరం ఎంతైనా ఉంది దోషులను నేను ఉరి తీస్తే వచ్చే డబ్బులతో నా కుమార్తె వివాహం జరిపించాలని ఉంది అంటూ నిర్భయ నిందితులను ఉరితీసే  తలారి పవన్ జలాద్  వ్యాఖ్యానించారు.అలాంటి రాక్షసులను ఉరి తీసే అవకాశం రావడమే తనకు దేవుడిచ్చిన వరమని భావిస్తున్నట్లు మీరట్ జైల్లో  తరతరాలుగా తలారులుగా పనిచేస్తున్న కుటుంబానికి చెందిన 57 ఏళ్ల పవన్ జలాద్  చెప్పుకొచ్చారు. 

 

 

 మామూలుగా ఒక్కరిని ఉరి తీస్తే 25 వేల రూపాయలు తనకు ఇస్తారని... ప్రస్తుతం నిర్భయ కేసులో నలుగురు నిందితులను ఉరి తీస్తే ప్రభుత్వం నుంచి ఒక్కో నిందితుడికి 25 వేల చొప్పున లక్ష రూపాయలు వస్తుందని ఈ వచ్చిన డబ్బుతో తన కుమార్తె వివాహం జరిపిస్తామని పవన్  చెప్పుకొచ్చారు. ఈ అవకాశం కోసమే తాను ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నారని తెలిపారు. ఇప్పటికే నిర్భయ దోషులకు ఉరి తీయాలని సమాచారం ఉత్తరప్రదేశ్ జైలు అధికారుల నుంచి అందిందని తెలిపిన పవన్... నిర్భయ నిందితులకు ఉరి ముందు తాను రిహార్సల్ చేయాల్సి ఉంది అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు 5 వేల వేతనం మాత్రమే ఇస్తున్నారని 5 వేల వేతనం తన కుటుంబ నిర్వహణకు ఏ మాత్రం సరిపోవడం లేదని చెప్పారు. దీంతో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తనకు నిర్భయ కేసులో ని నలుగురు నిందితులను ఉరి తీస్తే వచ్చే డబ్బు కొత్త ఊపిరి ఇస్తుంది  అంటూ పవన్ కళ్యాణ్ వాక్యం ఇచ్చారు. 

 

 

 ఒక్క నిందితుని ఉరి తీస్తే 25 వేల రూపాయలు ఇస్తారని... అధికారులు తనకే నలుగురు నిందితులను ఉరితీయడానికి  అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం అంటూ వ్యాఖ్యానించారు. తనకు తాతల కాలం నుంచి తలారులుగా  పని చేస్తున్నామని. మొదటగా తన తాత కళ్ళు రామ్ కి ఒక ఉరికి రెండు వందల రూపాయలు ఇచ్చే  వారిని గుర్తు చేశారు పవన్ జలాద్ . ఇందిరాగాంధీ హత్య కేసులో నిందితులైన సత్వంత్ సింగ్, కేహార్ సింగ్  లను కూడా తన తండ్రి మమ్ము జలాద్,  తాతలు కల్లూరామ్  కలిసి ఉరితీశారు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇక నిర్భయ దోషులకు ఉరి తీసేందుకు సిద్ధమైన తలారి పవన్ మాటలు విన్న వారు.. ఇలాంటి రాక్షసుల మరణం అందరికీ మంచి చేస్తుంది  అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: