ముందుగా హెచ్చరించినట్లే ఇరాన్ ప్రభుత్వం ఇరాక్ లోని అమెరికా సైనిక స్ధావరాలపై వరుస పెట్టి దాడులు చేస్తోంది. తమ సైనిక చీఫ్ ఖాసిం సులైమానీని అమెరికా హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షడు అయొతుల్లా ఖొమైనీ శపధం చేసిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే గడచిన రెండు రోజులుగా  ఇరాక్ లో ని అల్ సమద్ లో ఉన్న అమెరికా సైనిక క్యాంపులపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో వరుసపెట్టి దాడులు చేస్తోంది.

 

తాము జరిపిన దాడుల్లో అమెరికా సైనికులు 100 మంది చనిపోయినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అయితే దాడులు జరగటం మాత్రం వాస్తవమే కానీ తమ సైనికులు ఎవరూ చనిపోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా  ప్రకటించారు.  నిజానికి అమెరికాతో పోల్చుకుంటే ఇరాన్ చిట్టెలుక లాంటిదనే చెప్పాలి. కాబట్టి అమెరికా దాడిలో ఇరాన్ నష్టపోవటం చాలా సహజం. అదే ఇరాన్ దాడిలో అమెరికా నష్టపోతే ప్రపంచదేశాల్లో అగ్రరాజ్యానికి ఎంత అవమానమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

 

ఇరాక్ లోని అమెరికా సైనిక స్ధావరాలపై ఇరాన్ చేసిన దాడిలో  అగ్రరాజ్యానికి భారీ నష్టమే జరిగిందని అనధికారిక సమాచారం. అంతర్జాతీయ మీడియా ఇదే విషయాన్ని చెబుతోంది. అందుకనే ఇరాన్ దాడిలో  తమ సైనికులు ఎవరూ చనిపోలేదని అమెరికా పదే పదే ప్రకటిస్తోందని  అంతర్జాతీయ మీడియా అనుమానిస్తోంది.

 

మామూలుగా అమెరికా ఎవరినైనా చంపాలని అనుకున్నా, ఏ దేశంపైనైనా దాడి చేయాలని అనుకున్నా ముందుగా వ్యక్తినైనా, దేశానికైనా ఉగ్రవాది లేకపోతే తీవ్రవాద దేశమనే ముద్ర వేస్తుంది. అలాగే ఇపుడు ఇరాన్ మిలటరీ కమాండర్ సులైమానీని కూడా  అదే కోవలో ముద్రేసి ద్రోన్ మిసైల్స్ ద్వారా హతమార్చింది. నిజానికి సులైమానీని హతమార్చటానికి అమెరికా అమలు చేసిన వ్యూహం అద్భుతమనే చెప్పాలి. కానీ దాని పర్యవసానాలను అంచనా వేయటంలో నిర్లక్ష్యం వహించినట్లు అర్ధమవుతోంది.

 

ఇరాక తో పాటు పొరుగు దేశాలతో దశాబ్దాలుగా సాగిన యుద్ధంలో ఇరాన్ బాగా చితికిపోయింది. కాబట్టి అమెరికా దాడి చేసినా ఇరాన్ కు జరిగే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. అదే ఇరాన్ గనుక అమెరికాలో దాడి చేస్తే మాత్రం అగ్రరాజ్యం గింగిరాలు తిరిగిపోవాల్సిందే. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అల్ ఖైదా జరిపిన దాడి షాక్ నుండి కోలుకోవటానికే అమెరికాకు సంవత్సరాలు పట్టింది. అటువంటి దాడే మళ్ళీ ఇరాన్ గనుక చేస్తే ఇంకేమైనా ఉందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: