అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తు ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తున్నారు. ఇక తాజాగా ఎన్నికల ముందు ఇచ్చిన అమ్మఒడి  హామీని నెరవేరుస్తూ ఈ పథకానికి ఊపిరి పోయనున్నారు. నిరుపేద కుటుంబాలు తల్లిదండ్రులకు తమ పిల్లల చదువు భారం కాకూడదని ఉద్దేశంతో చేయూతనిచ్చేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా కుటుంబంలోని ఓ విద్యార్థికి 15 వేల రూపాయల చేయూతనిచ్చేందుకు నిర్ణయించి నేడు ఈ పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. నిరుపేదల విద్యార్థులు అందరూ స్కూలుకు వెళ్లి చదువుకోవాలని మహోన్నత లక్ష్యంతో... నిరుపేదలకు మెరుగైన విద్య అందించాలనే ద్యేయంతో  ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని చిత్తూరు జిల్లాలో ప్రారంభించనున్నారు. 

 

 

 కాగా చిత్తూరు జిల్లా కి మొదటిసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానుండగా ఇప్పటికే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యయి..  విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు సభాస్థలికి చేరుకున్నారు. ఇక చిత్తూరు మొత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కటౌట్లతో నిండిపోయాయి. కాగా తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో చిత్తూరులోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుగా అక్కడ పాఠశాల విద్యా శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను  పరిశీలించనున్నారు. అనంతరం స్థానికంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న 43 లక్షల మంది కుటుంబాలకు  ఒకేసారి 15 వేల రూపాయలు జమ చేయ నున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

 కాగా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక కోసం చిత్తూరు ప్రజలు అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో అడుగుపెడుతుండటంతో  చిత్తూరులోని నాయకులు కార్యకర్తలు నేతలు అందరూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమై పోయారు. అయితే దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేని మహోన్నత పథకాన్ని ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యమంత్రి రాక కోసం ఎదురు చూస్తున్నారు. కాగా  అమ్మ ఒడి పథకం కి 43 లక్షల మందిని అర్హులుకాగా.. ప్రభుత్వం ఈ పథకం కోసం 6500 కోట్లు కేటాయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: