అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన సమానంగా చూడాలని అధికారులు ఎంత అవగాహన కల్పించినప్పటికీ ఇప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రం... అబ్బాయి పుడితే పెంచుకోవడం అమ్మాయి పుడితే చెత్తకుప్పలో పడేయడం చేస్తూనే ఉన్నారు. నేటి సమాజంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం అమ్మాయి పుట్టాలని కోరుకున్నారు.  అమ్మాయి పుట్టిన తర్వాత ఊరంతా సంబరాలు చేసుకున్నారు. ఇంతకీ ఎందుకు అంతలా సంబరాలు చేసుకున్నారో.. తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే మరి. అబ్బాయిలు అమ్మాయిలు జనాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని భావించిన గ్రామస్తులు ఆడపిల్ల పుడితే బాగుండు అని కోరుకున్నారు. ఇక వారి కోరిక నెరవేరింది. జనవరి మొదటి వారంలో ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో వారి సంతోషం అంబరాన్నంటి  పోయింది. ఒకే వారంలో ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో సంతోషంతో అందరూ కలిసి గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని వేడుకలు జరుపుకున్నారు. 

 

 

 సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం హరిదాస్ పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో మొత్తం 816 మంది నివసిస్తూ ఉంటారు. అయితే అమ్మాయిలు అబ్బాయిలు మధ్య లింగ నిష్పత్తిలో అంతర్యం ఎక్కువగా ఉండడంతో ఆవేదన చెందారు గ్రామస్తులు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మనుగడకే ముప్పు రావొచ్చని ఆందోళన చెందారు. ఇలాగే జరుగుతూ పోతే లాభంలేదని.. భవిష్యత్తు మనుగడ కష్టమని భావించిన గ్రామస్తులు అందరూ ఆడపిల్లలు కన్న తల్లిదండ్రులను ప్రోత్సహించాలనే నిర్ణయించుకున్నారు. జనవరి మొదటి వారంలో ముగ్గురు అమ్మాయిలు జన్మించడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ గ్రామంలో ఒకే వారంలో ముగ్గురు జన్మించినందుకు గ్రామంలో అందరూ కలిసి సంతోషంతో వేడుకలు జరుపుకున్నారు. 

 

 

 ఆ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు గ్రామస్తులు. అనంతరం ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులను గ్రామపంచాయతీ వద్దకు పిలిపించి వారిని ఘనంగా సన్మానించారు. సుకన్య సమృద్ధి యోజన కింద ఆ ముగ్గురు అమ్మాయిల పేర్లు నమోదు చేయించారు. ఒక్కో చిన్నారికి వెయ్యి రూపాయల చొప్పున తొలి ఐదు నెలల మొత్తాన్ని జమ చేశారు. ఇందుకు సంబంధించిన మూడు వేల రూపాయలను తల్లిదండ్రులకు చేతికి అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు గ్రామస్తులు హరిదాసు పూర్  గ్రామస్తులు చేసిన గొప్ప పనికి అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: