కేరళ - తమిళనాడు సరిహద్దులోని కన్యాకుమారి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వాహనాలను తనిఖీ చేస్తున్న ఇన్ స్పెక్టర్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఇన్ స్పెక్టర్ విల్సన్ ఈ ఘటనలో మృతి చెందారు. పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ ఘటనపై విచారణ చేపట్టారు. నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దుండగులు స్పెషల్ సబ్ ఇన్ స్పెక్టర్ విల్సన్ ను కాల్చి చంపారు. 
 
గతంలో ఎస్సై విల్సన్ స్పెషల్ టాస్క్ ఫోర్సులో పని చేశారు. ఎస్సైకు, నిందితులకు మధ్య ఏవైనా సంబంధాలు ఉన్నాయా...? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని పదంతలుమూడు చెక్ పోస్ట్ దగ్గర ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ చెక్ పోస్ట్ కేరళ రాష్ట్ర సరిహద్దుకు కేవలం 100 మీటర్ల దూరంలో ఉందని తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. 
 
అదుపులోకి తీసుకున్న వ్యక్తులే నిందితులు అని పోలీసులు గుర్తించినప్పటికీ ఎస్సైను హత్య చేయటానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఎస్సైకు, నిందితులకు మధ్య గతంలో సంబంధాలు ఉన్నాయని ఎస్సైను నిందితులు హత్య చేయటానికి బలమైన కారణాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరపగా బుల్లెట్లు ఎస్సై తల మరియు పొట్టలోకి దూసుకెళ్లాయి. 
 
ఒక కారులో వచ్చిన నిందితులు కారు దిగి కాల్పులు జరిపి మిగతా పోలీసులకు ఏం జరిగిందో అర్థమయ్యేలోపే కారు ఎక్కి పారిపోయారు. తలలోకి, పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో విల్సన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారని సమాచారం. పోలీసుల విచారణ తరువాత నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎస్సైని దారుణంగా హత్య చేయటంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: