డబ్బును అత్యంత విలువైన సంపదగా అందరు గుర్తించినా ఆ సంపదను క్రమ పద్ధతిలో వినియోగించిన వారి దగ్గర మాత్రమే డబ్బు మరింత వచ్చి చేరుతుంది. భారతదేశ స్వాతంత్రం రాకముందు ఆనాటి భారతంలో అత్యంత ధనవంతులుగా పేరుగాంచిన దాల్మియా కుటుంబ వారసులు నేడు వ్యాపార సామ్రాజ్యాన్ని శాసించే స్థాయిని కోల్పోవడం వెనుక వారు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు 

ఒకప్పుడు సికిందరాబాద్ ప్రాంతం వ్యాపారులకు పెట్టింది పేరు. సికిందరాబాద్ ఏర్పడి రెండువందల ఏళ్లు అయిన సందర్భంగా ఆప్రాంతంలో ప్రముఖ వ్యాపార కుటుంబాల గురించి పత్రికల్లో ఆమధ్య వ్యాసాలు వచ్చాయి. ఆ రోజుల్లో సికిందరాబాద్‌లో పలు వ్యాపార కుటుంబాలు పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవి. ఆ నాటి ప్రముఖ వ్యాపార కుటుంబాల్లో కొన్ని కుటుంబాల వారసులు ఇప్పుడు బాగా దెబ్బతిన్నారు. డబ్బు గురించి సరైన అవగాహన లేకుండా వారసుల చేతిలో డబ్బు వచ్చి పడడమే దీనికి కారణం.

దీనితో వారసత్వంగా వచ్చిన సంపదను తెలివిగా పెంపొందించుకొనే వారి దగ్గర మాత్రమే డబ్బు నిలబడుతుంది. ఇలా కొన్ని పారిశ్రామిక కుటుంబాలు అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలలో ఒక వెలుగు వెలిగిన కుటుంబాలు ఇప్పుడు ఆర్ధికంగా కనుమరుగు అయిపోవడానికి గల కారణం 
డబ్బు విలువ గురించి అవగాహన లేకపోవడమే. ఒకప్పుడు గుజరాత్‌ లో సాధారణ వ్యాపార రంగానికి చెందిన కొన్ని కుటుంబాల వాళ్ళు ఈరోజు వస్త్ర వ్యాపారంలో వజ్రాల వ్యాపారంలో దేశ ఆర్ధిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగారు అంటే డబ్బును ఒక వస్తువులా కాకుండా ఎంతో విలువైన ఆభరణం లా వారు ఇచ్చే గౌరవం.

గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి హరేకృష్ణ ఎక్స్‌ఫోర్ట్ అధిపతి సావ్‌ జీ ధొలాకియా తమ కుటుంబ సభ్యులందరికీ డబ్బు విలువ తెలియడం కోసం ఒకమార్గం కనిపెట్టారు. కుటుంబంలో ప్రతి ఏడాది ఒకరు ఏదో ఒకప్రాంతానికి వెళ్లి తమ కుటుంబం గురించి చెప్పకుండా డబ్బులు ఏమి తీసుకు వెళ్లకుండా అక్కడే ఏదో ఒక పని చేసి నెలరోజులు బతకాలి. ఆ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఆమధ్య హైదరాబాద్ లో నెల రోజుల పాటు బేకరీల్లో షాపుల్లో చిన్నా చితక ఉద్యోగాలు చేసి లాడ్జీలో పడుకున్నాడు. ఈ వజ్రాల వ్యాపారి కుమారుడు అమెరికాలో ఎంబిఏచదివిన వ్యక్తి అని తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఎంబిఏలో డబ్బు విలువ గురించి చెప్పే పాఠాల కన్నా నెల రోజులు బతుకు తెరువు కోసం అతను పడ్డ కష్టాలు ఎక్కువ పాఠాలు నేర్పాయి. జేబులో డబ్బులు లేక పోవడం కడుపులో ఆకలి ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయం నేర్పలేని జీవిత పాఠాలు తన హైదరాబాద్ అజ్ఞాత జీవితం నేర్పించింది అంటూ ఆయన అప్పట్లో చేసిన కామెంట్స్ మీడియాలో హాట్ న్యూస్. దీనితో డబ్బు విలువ తెలిసిన వాడి దగ్గర మాత్రమే డబ్బు వచ్చి చేరుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: