అమెరికా సైనికుల డ్రోన్‌ దాడిలో ఇరాన్ జనరల్‌ సులేమానీ చనిపోవడంతో ఆ దేశం తీవ్ర ఆగ్రహానికి గురైంది. తమ జనరల్ సులేమానీని చంపినందుకు ప్రతీకార చర్యగా పగ తీర్చుకుంటామని అనేక నినాదాలను చేయడంతోపాటు బుధవారం రోజు తెల్లవారుజామున ఇరాక్ దేశంలో ఉన్నటువంటి అమెరికా వైమానిక స్థావరాలను ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల దాడితో ద్వంసం చేసేసారు. వీరిద్దరి కొట్లాటల మధ్య నలిగిపోతున్న దేశాలలో ఒకటి మన భారతదేశం.


ఉద్రేకంతో ఉన్న ఇరాన్ నుండి ఎటువంటి సాయం అందక పోవడంతో... బంగారం ధరలు పెరిగిపోవడం, స్టాక్ మార్కెట్లు పడిపోవడం, పెట్రోల్ ధర పెరగడం లాంటివన్నీ మన ఆర్థిక వ్యవస్థ పై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. అయితే దీనిని కారణంగా చెప్పుకుంటూ ఇరాన్ దేశం వలన మీకు ఎంతో నష్టం జరుగుతుంది కాబట్టి మాతో కలిసి చేతులు కలపండి. మాకు యుద్ధానికి సంబంధించిన అన్ని ఆయుధాలను, ఇంకా ఇతర వాటిని ఇవ్వండి అంటూ పరోక్షంగా ట్రంపు అడుగుతున్నాడు.

ఇంతకీ ఇరాన్-అమెరికాకు మధ్య యుద్ధం ఎలా జరుగుతుంది అంటే..!

బుధవారం రోజు 15 ఖండాంతర క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. అయితే ఈ క్షిపణుల దాడిలో విమానాలు, హెలికాప్టర్లు నాశనం కావడంతో పాటు 80 మంది అమెరికా సైనికులు చనిపోయారని ఇరాన్ చెప్పుకొచ్చింది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఏ ఒక్క అమెరికా సైనికుడు కూడా మరణించలేదని, అంతా మంచిగానే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

నిజానికి.. ఇరాన్ చుట్టూ ఉన్న దేశాలలో స్థావరం ఉంటున్న అమెరికా సైనికులు క్షిపణి నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కానీ తాజాగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల దాడిని ఎదుర్కోలేక పోయాయి, ఆపలేకపోయారు.. ఇక్కడ అమెరికా యొక్క వైఫల్యమా.. లేకపోతే ప్లాన్ ప్రకారమే ఈ క్షిపణుల దాడిని అడ్డుకోలేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.

ఇకపోతే, ఇరాన్ ఆధీనంలో 2000-3000 కిలోమీటర్ల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించే ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. మామూలు క్షిపణులతో పోలిస్తే.. ఖండాంతర క్షిపణులను ఎదుర్కోవడం కష్టతరమైనది. ఎందుకంటే ఇది కేవలం 20 నిమిషాల్లోనే లక్ష్యాన్ని ఛేదించి ధ్వంసం చేస్తాయి. ఈ క్షిపణిని ప్రయోగించగానే అవి మొదటగా లక్ష్యానికి ఎదురుగా వెళ్లకుండా... అంతరిక్షంలోకి అనగా భూమినుంచి 2000 కిలోమీటర్ల ఎత్తుకి వెళ్లి ఆ తర్వాత లక్షాన్ని సాధించే మార్గంలో నిమిషానికి 420 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అంత వేగంతో వెళుతున్న ఈ క్షిపణులను అడ్డుకోవడానికి సరిపడా సమయం కూడా మిసైల్ డిఫెన్స్ సిస్టంకి ఉండదు.

 

అయితే ఈ డిఫెన్స్ సిస్టం వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించినా.. ఈ క్షిపణులు తన దిశను తరచూ మార్చుకుంటూ.. అలాగే వేగంగా వెళ్లడం, నెమ్మదిగా వెళ్ళడం వంటివి చేస్తూ డిఫెన్స్ సిస్టం కు ఎదుర్కొనే అన్ని అవకాశాలను తగ్గించేస్తాయి. అయినా సరే వీటిని ఎదుర్కొనే డిఫెన్స్ వ్యవస్థ అమెరికా దగ్గర ఉంది కానీ వారు ఆపడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇరాన్ దేశం అమెరికా స్థావరాలపై దాడి చేస్తున్నామని ముందే ఇరాక్ దేశానికి చెప్పింది. అయితే ఈ ఇరాక్ దేశం క్షిపణుల దాడి గురించి అమెరికా దేశానికి ముందస్తుగానే చెప్పింది. దాంతో అమెరికా వాళ్ళు తమ సైన్యానికి జాగ్రత్తలు చెప్పి వారిని సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించారు. ఒకవేళ ఇరాన్ నిజంగానే అమెరికాపై దాడి చేయాలనుకుంటే.. అసలు సైన్యమే లేని ఎంతో దూరంలో ఉన్నటువంటి ఎర్బిల్, అల్ అసద్ ఎందుకు దాడి చేసిందనేది ఒక పెద్ద క్యూస్షన్ మార్క్.


మరొకవైపు ఇరాన్ పై యుద్ధం చేయాలనే ఆలోచన అమెరికా దేశానికి అస్సలు లేదని అర్థమవుతుంది. ఎందుకంటే ఇరాన్.. క్షిపణులు దాడి చేసిన వెంటనే... అమెరికా పగ తీర్చుకోవాలనుకుంటే తమదైన శైలిలో బాంబుల వర్షం కురిపించేది. కానీ అది చేయలేదు. దీంతో ఇరాన్ కేవలం తమ దేశ ప్రజల యొక్క కోపాన్ని శాంతి పరచడానికే ఇటువంటి చర్యలు చేస్తుంది తప్ప అమెరికాపై దాడి చేయాలనే ఎటువంటి ఉద్దేశమూ లేదని తెలుస్తుంది.


అయితే, మొన్న అనగా మంగళవారం రోజు నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ ని కలిశారు. ఇరుదేశాలకి ఉపయోగపడే విషయంలో తప్పనిసరిగా భారతదేశం ముందుకు వస్తుందని మోడీ చెప్పారు. కానీ ఇరాన్ దేశానికి మాత్రం వ్యతిరేకంగా మోడీ సర్కార్ వెళ్లడం లేదు. ఎందుకంటే ఇరాన్ దేశం మనకు ఎన్నో కోణాల్లో మిత్ర దేశంగా మెలుగుతున్నది. కానీ అమెరికా మాత్రం ఇంతకుముందు భారత్-అమెరికాల మధ్య జరిగిన ఒక మిలిటరీ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ... ఇండియాకి సంబంధించినటువంటి మిలటరీ అంశాలను అనగా.. యుద్ధ నౌకలను, స్థావరాలని తమకు ఇవ్వాలని పరోక్షంగా అడుగుతున్నది. ఇండియానే ఎందుకు అడుగుతుదంటే.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు తమ యుద్ధ స్థావరాలను అమెరికాకు ఇవ్వబోమని చెబుతున్నాయి కాబట్టి. అందుకే తూర్పు వైపు నుంచి దాడి చేసే విధంగా అవకాశాలు ఉండడానికి మన దేశాన్ని సహాయం అడుగుతున్నది అమెరికా. అయితే ఇద్దరికీ ఉపయోగపడే విషయాల్లో తప్ప మరేతర విషయాలలో సహకరించమని ఇండియా చెబుతూ.. అలాగే ఇరు దేశాల మధ్య యుద్ధం అసలు పెరగకూడదు ఆశిస్తున్నది. సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలిక.




















మరింత సమాచారం తెలుసుకోండి: