విజయవాడ బెంజిసర్కిల్లో బుధవారం రాత్రి చంద్రబాబునాయుడు రోడ్లపై కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  ఒకపుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా డిమాండ్ తో ఆందోళనలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్ళారు. అప్పుడు జగన్ ను  ఎయిర్ పోర్టు రన్ వే మీదనే లోకల్ పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.  జగన్ ఎంత మొత్తుకున్నా వినకుండానే పోలీసులు తిరుగుటపాలో మళ్ళీ విమానం ఎక్కించేసి హైదరాబాద్ కు పంపేశారు.

 

ప్రభుత్వ వైఖరికి నిరసనగా జగన్  తనతో పాటున్న నేతలతో కొద్దిసేపు విమానాశ్రయం రన్ వే పైనే కూర్చుని నిరసన తెలిపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పట్లో రన్ వే పై కూర్చుని ప్రధాన ప్రతిపక్ష నేత నిరసన తెలపటం సంచలనమైంది.

 

సీన్ కట్ చేస్తే కాలం గిర్రున తిరిగి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఇపుడు ముఖ్యమత్రయ్యారు. అప్పటి సిఎం చంద్రబాబు ఇపుడు ప్రతిపక్షంలోకి మారారు. ఇక అమరావతి తరలింపు నేపధ్యంలో జాయింట్ యాక్షన్ కమిటి నేతృత్వంలో రాష్ట్రంలో బస్సుయాత్ర చేద్దామనుకున్నారు. అయితే అందుకు అవసరమైన పర్మిషన్లు తీసుకోలేదు. అందుకని పోలీసులు బస్సులను సీజ్ చేశారు.

 

పోలీసుల చర్యకు వ్యతిరేకంగా నిరసనగా చంద్రబాబు బెంజిసర్కిల్ లో రోడ్డుపైనే ధన్నా చేశారు. దాదాపు మూడు గంటలసేపు ట్రాఫిక్ ఆగిపోయింది. సరే చివరకు పోలీసులు చంద్రబాబును కూడా అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించేశారు లేండి. కానీ  చంద్రబాబు రోడ్డు మీద కూర్చోవటాన్ని అప్పట్లో జగన్ విమానాశ్రయంలో కూర్చున్న ఫొటోలతో జత చేసి సోషల్ మీడియాలో  విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

 

’భగవంతుడు ఎవ్వరినీ వదలడు  సామి....అవపరం వచ్చినపుడు అందరి సరదాలు తీర్చేస్తాడు.. గాడ్ ఈజ్ గ్రేట్..  చాలా తొందరగా తీర్చేశాడు’  అంటూ కామెంట్లు పెట్టి ఫొటోను మరీ  వైరల్ చేస్తున్నారు.  అప్పుడు జగన్ ను అదుపులోకి తీసుకున్నపుడు చంద్రబాబు అండ్ కో నోటికొచ్చినట్లు మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తుంటే చూస్తు ఊరుకుంటామా ? అంటూ ప్రశ్నించారు. మరి అదే సమాధానం ఇపుడు చంద్రబాబుకూ వర్తిస్తుంది కదా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: