రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని దీంతో పాటు మరో రెండు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానులు అంటూ ప్రకటించామని ఒకవైపు అధికార పార్టీ వైసీపీ పదేపదే చెబుతున్నా వైసీపీ రాజకీయ ప్రత్యర్ధులు వినిపించుకోవడంలేదు. అమరావతిలో ఏదో జరిగిపోతోంది అన్నట్టుగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మరింతగా భయాందోళనలు పెంచే దిశగా వ్యవహరిస్తున్నారు. ఈ ఉద్యమంలోకి బీజేపీతో పాటు టిడిపి, జనసేన, సిపిఐ రంగంలోకి దిగి ప్రభుత్వంపై పోరాటం చేస్తూ, తమ పార్టీకి మరింతగా ఆదరణ పెరిగేలా చేసుకుంటున్నాయి. కానీ మొదటి నుంచి ఈ వ్యవహారానికి సిపిఎం పార్టీ దూరంగా ఉంటూ వస్తోంది.


 ప్రజా పోరాటాలు ఎక్కడ జరిగినా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పట్టించుకోకుండా సిపిఐ, సిపిఎం కలిసి ఉమ్మడిగా పోరాటాలు చేస్తూ ఉంటాయి. వారి విధానాల విషయంలో కొన్ని భేదాలు ఉన్నప్పటికీ చాలా అంశాల్లో మాత్రం ఒకే అభిప్రాయంతో ముందుకు వెళుతూ ఉంటారు. అయితే రాజధాని విషయంలో మాత్రం సిపిఐ నేరుగా రంగంలోకి దిగి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటుంటే సిపిఎం మాత్రం ఈ నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. దీనికి కారణం ఏంటో తెలియక వైసిపి ప్రత్యర్ధి పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. దీనికి కారణాలు విశ్లేషిస్తే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్తులోనూ వైసీపీతో కలిసి సిపిఎం పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్న కారణంగానే వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఆ పార్టీ నీ వెనక తగ్గుతోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


 అదే విధంగా మొదటి నుంచి జగన్ సిపిఎం పార్టీ తో మంచి సంబంధాలు కొనసాగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి మరి జగన్ పరామర్శించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ కారణంగానో మరో కారణంగానో తెలియదు కానీ సిపిఎం జగన్ విషయంలో మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తంగా వామపక్ష పార్టీల మధ్య జగన్ తీసుకురావడంలో బాగానే సక్సెస్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: