ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి గారు పదవి చేపట్టిన దగ్గర నుండి చాలా మంచి పనులు చేసారు.. నవరత్నాలు అనే ఎజెండా తో ప్రజలకి చేరువ అయ్యారు.. దానిలో భాగంగా నవరత్నాల్లో కీలకమైన అమ్మఒడిని చిత్తూరులో ప్రారంభించారు. ఈ పధకం ద్వారా దాదాపు 43 లక్షల మంది తల్లులకు దాదాపు రూ 6,318 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. దీంతో సుమారుగా 82 లక్షల మంది పిల్లలకు లబ్ది కలుగుతుందని చెప్పుకొచ్చారు.

 

ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు మాత్రమే ఈ పధకం అమలు చేస్తామని చెప్పినా తర్వాత ఇంటర్ వారికీ కూడా వర్తింపు చేసారు.. ప్రతి ఒక్క చదువుకునే పిల్ల, పిల్లవాడికి సంవత్సరానికి 15 వేలు ఇస్తారు.. ఆర్థిక ఇబ్బందులు ఉండి చదివించలేని ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యారు.. మావయ్య ల పిల్లల్ని చదివిస్తున్నారు. పాఠశాలల నాడు నేడులో తల్లి తండ్రులు సైతం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

 

పేదింటి తల్లులకు తమ బిడ్దలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. పేదల బిడ్దలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ పధకం అమలు చేస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారుతొలి విడతలో పధకానికి ఎంపిక కాని లబ్ది దారుల కోసం నెల రోజుల సమయం పొడిగిస్తున్నామని వచ్చే నెల 9వ తేదీ లోగా లబ్దిదారులు నమోదు చేయించుకోచ్చని సీఎం జగన్ వివరించారు.

 

వచ్చే జూన్ నుండి ఒకటి నుండి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం అమలు చేస్తామని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేసారు. పేదల పిల్లలకు ఇంగ్లీషు మీడియం కావాలా వద్దా మీరే చెప్పండి అంటూ సభకు హాజరైన వారి నుండి సమాధానం రాబట్టారు.

 

మీరు గట్టిగా చెప్పాలని ..లేకుంటా వారి పిల్లలకు మాత్రమే ఇంగ్లీషు మీడియం కావాలని కోరుకొనే పత్రికాధిపతులకు..ప్రముఖ హీరోలకు..సీనియర్ రాజనీయ నేతలకు వినబడదని సైటైర్ వేసారు. బడుల్లో ఇప్పటి వరకు మధ్నాహ్న భోజనంలో మార్పులు చేస్తున్నామని సీఎం ప్రకటించారు. ప్రతీ రోజు ఒకే మెనూ కాకుండా..రోజుకో రకం ఆహారం అందిస్తామని చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: