విషాదం వెంటే సుఖం ఉంటుంది... కన్నీరు వెంటే పన్నీరు ఉంటుంది... దుఃఖం వెనకే సంతోషం ఉంటుంది... ఇలా ఒకదాని తరువాత మరొకటి వస్తూనే ఉంటాయి.  ఏవి శాశ్వతంగా ఉండవు...సుఖమైనా దుఃఖమైన సరే కొన్నాళ్ల తరువాత తిరిగి మామూలుగానే మారిపోతుంది.  అయితే, ఈ సుఖ దుఃఖాలను పక్కన పెడితే గత కొంతకాలంగా ప్రపంచాన్ని కొన్ని విషయాలు తెగ ఇబ్బందులు పెడుతున్నాయి.  వాటిల్లో ఒకటి అడవుల్లో కార్చిచ్చు.  


అమెజాన్ లో మొదలైన ఈ కార్చిచ్చు... ఆస్ట్రేలియాను కుదిపేస్తున్నది.  ఆస్ట్రేలియాలోని అడిలైడ్ అడవుల్లో ఈ కార్చిచ్చు కారణంగా 100 కోట్ల జంతుజాతులు మరణించాయి.  అరుదైన కంగారులు ఇతర జంతువులు సైతం అగ్నికి ఆహుతయ్యాయి.  దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అగ్ని కారణంగా దాదాపుగా 30 మంది మరణించారు.  వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి.  


ఇక ఇదిలా ఉంటె, ఈ కార్చిచ్చు కారణంగా ఓ వ్యక్తి తన సర్వం కోల్పోయారు.  సర్వం కోల్పోయిన వ్యక్తికి అదృష్టం కలిసి వస్తే... ఎలా ఉంటుంది... అంతకంటే మరొక ఆనందం ఉంటుందా చెప్పండి.  ఇప్పుడు ఇక్కడ ఇదే జరిగింది.  గతేడాది కార్చిచ్చులో ఓ వ్యక్తి తన ఇంటిని కోల్పోయారు.  ఇంటితో పాటు అన్ని వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి.  దీంతో ఏం చేయాలో ఆ వ్యక్తికి అర్ధం కాలేదు.  మరలా మొదటి నుంచి జీవితం ప్రారంభించాలని అనుకున్నారు.  


అయితే, అలా జీవితాన్ని మొదలు పెట్టిన వ్యక్తి ఓ లాటరీ కొన్నారు.  భార్య దగ్గర ఉంచిన ఆ లాటరీకి ప్రైజ్ వచ్చింది.  ప్రైజ్ అంటే వందలో వేలో కాదు.  ఏకంగా రూ. 7.14 కోట్లు ప్రైజ్ వచ్చింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.  కొత్తగా ప్రారంభించాలని అనుకున్న వ్యక్తికి ఇలా లాటరీ తగలడం అంటే అతని అదృష్టం అలాంటిది మరి.  దానిని ఎవరూ కాదనలేరు.  అదృష్టం ఉంటె ఏదైనా సాధించగలం అని నిరూపించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: