రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోతున్నాయి.  ఎప్పుడు ఎలా మారుతుందో తెలియడం లేదు.  అమరావతి సమస్య రోజు రోజుకు జఠిలం అవుతున్నది.  ఎంతగా రాజధాని సమస్యను పక్కన పెట్టాలి అని చూస్తున్నా సాధ్యం కావడం లేదు.  అంతేకాదు, రాజధాని విషయంలో ఎందుకు ఇలాంటి గొడవలు సృష్టిస్తున్నారో తెలియడం లేదు.  రైతులు గత 23 రోజులుగా ధర్నాలు, నిరసనలు తెలియజేస్తున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, ఎన్నికల సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అమ్మఒడి పధకం అమలు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.  చెప్పినట్టుగానే జగన్, ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.  జనవరి 1 వ తేదీన ఈ పధకం అమలు చేస్తామని చెప్పారు.  కాగా, జనవరి 9 నుంచి పధకం అమలు జరుగుతున్నది.  ఈ పధకాన్ని ఈరోజు చిత్తూరు జిల్లాలో లాంచ్ చేశారు.  ఈ పధకం లాంచ్ చేసిన తరువాత ముఖ్యమంత్రి మాట్లాడారు.  


ఆ తరువాత ఈ పధకం గురించి రోజా మాట్లాడింది.  ఈ పధకాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పొగడ్తలతో ముంచెత్తింది.  ఈ పధకం ద్వారా పిల్లలకు అనేక లాభాలు ఉంటాయని చెప్పింది.  పధకం పిల్లల చదువుకు ఉపయోగపడుతుందని రోజా తెలిపింది.  అక్కడితో ఆగకుండా చంద్రబాబుపై ఒక రేంజ్ లో విరుచుకుపడింది.  బాబు చేసిన పనులను, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.  


అమ్మ ఒడి పథకం. జగన్ తెచ్చిన ఈ పథకం విప్లవాత్మకమైన పథకం. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకురాగా,  నేడు జగన్ అమ్మ ఒడి తీసుకొచ్చారు. దీని వల్ల చదువు మధ్యలో ఆగిపోవడం తగ్గి పిల్లలు చక్కగా చదువుకుంటారు. అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చిన చరిత్రకారుడు జగన్. పేదల చదువును కార్పొరేట్లకు బలిచేసిన చరిత్ర హీనుడు చంద్రబాబునాయుడు అని రోజా పేర్కొన్నది.  మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహరం అందించిన చరిత్రకారుడు జగన్. పేద పిల్లలకు అందించే గుడ్లను మింగిన చరిత్రహీనుడు చంద్రబాబు  అని విమర్శించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: