20 ఏళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు ఓ గ్యాంగ్ స్టర్ . పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసిన చిక్కిన దాఖలాలు మాత్రం లేవు. ఇప్పటికే ఈ గ్యాంగ్ స్టర్ పై  ఎన్నో కేసులు నమోదయ్యాయి. చివరికి ఈ గ్యాంగ్ స్టర్  కూతురు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని పట్టుకుని కటకటాల వెనక్కు తోసారు . ఇంతకీ ఆ గ్యాంగ్ స్టర్  ఎవరు... అతని కూతురు ఏం సమాచారం ఇచ్చింది తెలియాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే... మహారాష్ట్ర ముంబై పోలీసులు దోపిడి నిరోధక విభాగం ఓ గ్యాంగ్ స్టర్  గురించి తీవ్రంగా గాలిస్తున్నారు. ఆ గ్యాంగ్ స్టర్  ఎవరో కాదు పరారీలో ఉన్న ఎజాజ్ లక్డావాలా. గ్యాంగ్ స్టర్ ఎజాజ్ లక్డావాల గత 20 సంవత్సరాలుగా పోలీసులకు చిక్కకుండా పరారీ  లోనే ఉన్నాడు. అతనిపై 27 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 

 

 

 అయితే గ్యాంగ్ స్టర్ ఎజాజ్ లక్డావాలా  వాళ్ళను జనవరి 21న పోలీస్ కస్టడీకి తరలించారు. అయితే పరారీలో ఉన్న ఈ గ్యాంగ్ స్టర్ పై అనేక దోపిడి,  హత్యాయత్నం మరియు అల్లర్లకు సంబంధించి 27 కేసులు ఉన్నాయి. ముంబై క్రైమ్ బ్రాంచ్ కి చెందిన యాంటీ  ఎక్స్ట్రాక్షన్ సెల్...గ్యాంగ్ స్టర్ ఎజాజ్ లక్డావాలా  కూతురు సోనియా లక్డావాలను అరెస్ట్ చేశారు పోలీసులు. దోపిడీకి పాల్పడిన రెండవ కేసులో గ్యాంగ్ స్టర్  కూతురు సోనియా లక్డావాలను  పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు చిక్కకుండా 20 ఏళ్ళ నుండి పరారీలో ఉన్న తన తండ్రి ఎజాజ్ లక్డావాలా  ఇచ్చిన ఆదేశాల మేరకు కూతురు సోనియా లక్డావాలా బాంద్రాకు చెందిన రియల్టర్  ను  ఎదురించి దోపిడీకి పాల్పడింది. ఈ కేసులో పోలీసులు సోనియా లక్డావాలను  అదుపులోకి తీసుకున్నారు. 

 

 

 పరారీలో ఉన్న గ్యాంగ్ స్టార్ ఎజాజ్ లక్డావాలా  కూతురు సోనియా ను  పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించగా తన తండ్రికి సంబంధించి పలు వివరాలను వెల్లడించింది గ్యాంగ్ స్టర్  కూతురు సోనియా లక్డావాలా . దీంతో ఆ గ్యాంగ్ స్టర్  కూతురు సోనియా ఇచ్చిన వివరాలతో పాటు... పోలీసుల దగ్గర ఉన్న వివరాలతో దాదాపు 20 ఏళ్ల నుంచి పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్  ఎజాజ్ లక్డావాలను  పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే గ్యాంగ్ స్టార్ ఎజాజ్ లక్డావాలా   అరెస్టుపై క్రైమ్ జాయింట్ కమిషనర్ సంతోష్ రాస్తోగి  మాట్లాడుతూ.. 20 ఏళ్ల నుంచి పరారీలో ఉన్న గ్యాంగ్ స్టార్ ఎజాజ్ లక్డావాలా  కుమార్తె సోనియా లక్డావాలా  పోలీస్ విచారణలో .. తన తండ్రికి సంబంధించి మాకు చాలా సమాచారం అందించారు.. పాట్నాలో ఎజాజ్ లక్డావాలా రాక  గురించి పోలీస్ వర్గాలు కూడా సమాచారం అందించారు. అతన్ని జట్టన్ పూర్  పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు అని తెలిపారు క్రైమ్ జాయింట్ కమిషనర్ సంతోష్ రాస్తోగి. ప్రస్తుతం వీరిద్దరిని కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కస్టడీకి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: