అబ్బా.. ఎంతటి చల్ల వార్త... అని అనుకుంటున్నారు కదా.. చల్లటి వార్తే కానీ నేను చెప్పను అబ్బా. మళ్ళి నన్ను తిట్టేస్తారు మీరు కామెంట్లలో. కానీ చెప్పటం నా ధర్మం. అందుకే చెప్పేస్తున్నా.. తిట్టకూడదు మళ్ళి. ఆ వార్త ఏంటంటే.. వారం రోజుల్లో మూడు వేలు పెరిగిన బంగారం ధర ఈరోజు తాజాగా 766 రూపాయిలు తగ్గి.. భారీగా తగ్గినా బంగారం ధర అని రాపించుకుంది.   

 

చదవడానికి కొంచం చీరాకుగా ఉన్న బంగారం ధర మరి దారుణంగా ప్రవర్తిస్తుంది. ఎంత అమెరికా.. ఇరాన్ యుద్దాలు జరిగితే మాత్రం బంగారం ధర అంత పెరిగి పోతుందా వదిన అని పక్కింటి సరోజా అడుగుతుంది. కానీ ఎం చేస్తాం అమ్మ తప్పదు అని ఆ వదిన చెప్తుంది. అలా ఉంది ఈ బంగారం పరిస్థితి.

 

వారం క్రితం వరుకు బంగారం ధరలు ఒక రోజు తగ్గుతాయి మరో రోజు పెరుగుతాయి అని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు కేవలం వారం రోజుల్లో మూడు వేలు పెరిగి.. ఇది పెరిగేదే కానీ తగ్గే బంగారం కాదు అని అర్థం అయ్యింది. కానీ ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఎంత తగ్గాయి అంటే..     

 

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 766 రూపాయిల తగ్గుదలతో 40,634 రూపాయలకు పత్నమవ్వగా.. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 722 రూపాయిల తగ్గుదలతో 38,403 రూపాయిలకు దిగిపోయింది. ఇంకా బంగారమే ఇంత పతనమవుతే వెండి ధరలు ఊరికే ఉంటాయి... అవి మరి భారీగా తగ్గిపోయాయి. ఎంత అంటే.. 1,148 రూపాయిల తగ్గుదలతో 47,932 రూపాయలకు చేరి వెండి ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది.. ఇలా నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి.     

మరింత సమాచారం తెలుసుకోండి: