ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తున్న  విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెట్టి పొరుగు రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక తాజాగా ఇప్పుడు వరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశ పెట్టని మహోన్నత పథకానికి ఊపిరి పోశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అమ్మ ఒడి పథకాన్ని కి నేడు శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని మహోన్నత లక్ష్యంతో విద్యార్థుల తల్లి లేదా రక్షకుల ఖాతాలు 15 వేల రూపాయలు జమ చేసేందుకు జగన్ సర్కారు నిర్ణయించింది. 

 

 

 అయితే అమ్మ ఒడి పథకం లో 43 లక్షల మంది కుటుంబాలు లబ్ధి పొందాయి. దీనికోసం ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల కోట్లు కేటాయించింది. ఇకపోతే సీఎం  జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాలో 15000 జమ అయిన విషయం తెలిసిందే, ఈ క్రమంలోనే టిడిపి మాజీ మంత్రి ఎమ్మెల్సీ నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఖాతాలో కూడా 15 వేల రూపాయలు జమ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తన సతీమణి నారా బ్రాహ్మణి ఖాతాలో  15000 జమ చేసినందుకు ధన్యవాదాలు అంటూ నారా లోకేష్ చెబుతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. 

 

 

 ఇక తాజాగా సోషల్ మీడియాలో వెలిసిన పోస్టులపై స్పందించిన  నారా లోకేష్ విరుచుకుపడ్డారు. అది ఫేక్ పోస్ట్ అంటూ స్పష్టం చేశారు నారా లోకేష్. మీ పిచ్చి డ్రామాలు నా దగ్గర కాదు... జగన్మోహన్ రెడ్డి ముందు వేసుకోండి... వైసిపి పేటీఎం బ్యాచ్ ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది... మార్ఫింగ్ చేసి తప్పుడు పనులు చేస్తే జగన్ దొంగ బ్రతుకు గుడ్డలూడదీసి రోడ్డు మీద నిలబెడతా అంటూ ఘాటుగా హెచ్చరించారు నారా లోకేష్. రేపు శుక్రవారం అక్కడ కొట్టుకోండి మీ డప్పు అంటూ... ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు నారా లోకేష్. 5 రూపాయల ముష్టి  కోసం వైసీపీ పేటీఎం బ్యాచ్ పడుతున్న కష్టం చూస్తుంటే తనకు ఎంతో జాలి కలుగుతుంది అంటూ సెటైర్ వేశారు నారా లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: