ఉప రాష్ట్రపతి అయిన తర్వాత వెంకయ్య నాయుడు గారి రేంజ్ పెరిగింది ఆయన ఇప్పుడు ఒక రాజకీయవేత్త కాదు., బిజెపి పార్టీ వ్యక్తి అంతకంటే కాదు. ఒక బాధ్యతాయుతమైన  పదవిలో ఉన్న వ్యక్తి. ఆయన సహాయం తీసుకోవడం, ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందని అనుకున్నప్పుడు ఆయన యొక్క తోడు కోసం ఎదురుచూడడం .. ఏ మాత్రం తప్పు కాదనే చెప్పాలి . ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐడియాలు అటువైపు వెళుతున్న అనిపిస్తుంది. ఈమధ్య అమరావతి విషయంలో వెంకయ్యనాయుడు మాటల కోసం  చాలా మంది ఎదురు చూస్తున్నారు . ఆయన వచ్చి ఏదైనా సహాయం చేయాలని వారు కోరుతున్నారు.  వెంకయ్యనాయుడు త్వరలోనే ఈ ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే అటువంటి  వ్యక్తి మాటలు వేరే టాపిక్ కి సంబంధించి వైరల్ అవుతున్నాయి.

 

 

 ఎన్నికలలో  ఓట్ల కోసం కొనుగోలు పంపకాలు పరిపాటిగా మారిపోయింది అని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు . బిర్యానీ జన సమీకరణకు ప్రజలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు . రాజకీయాల్లో డబ్బు పంపిణీ  అనే అంశంపై హైదరాబాద్ యూనివర్సిటీ ఎస్బిఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తీరు సరిగా లేదని ఆయన బాధ పడడం జరిగింది,  అంతే కాకుండా ఆరు నెలలకోసారి దేశంలో ఎన్నికలు జరుగుతాయని..  దేశంలో పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు అన్నీ ఒకే ఒక్క నిర్వహించాలని స్పష్టం చేశారు.  ఇది ఒక్కటే పరిష్కారమని ఆయన సూచించారు.  ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరగడం వల్ల హామీలు మద్యం ముగింపు లభిస్తుందని అన్నారు.

 

 

 పార్టీలకు కూడా పూర్తిగా ఉంటుందని అన్నారు ప్రస్తుతం ఆరు నెలలకోసారి ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరపడం వల్ల ఫార్ములా బస్సు బిర్యానీ పద్ధతిలో దేశంలో పెరిగి పోయిందని విమర్శించారు . అమరావతి వ్యవహారంలో ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది అని జగన్మోహన్రెడ్డి కూడా ఆలోచిస్తున్నారు . దీనికి తగ్గట్టుగానే త్వరలో ఉప రాష్ట్రపతి ని  కలిసి అమరావతి రైతుల కి నచ్చచెప్పాలని ఆయనకు తన వంతు  ప్రయత్నం చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి.  ఒక పార్టీ నాయకుడిగా ఆయన ఇప్పుడు ప్రకటించాల్సిన అవసరం లేదు.  ఎందుకంటే ఆయన ఉపరాష్ట్రపతి,  సేమ్ టైం ఆయన మాటని అమరావతి రైతులు నమ్ముతారు కాబట్టి ఆయన ద్వారా వారిని ఒప్పించే ప్రయత్నం జగన్మోహన్రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అనే మాట వినిపిస్తోంది చూద్దాం ఏం జరుగుతుందో. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: