పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అక్రమంగా తయారు చేస్తున్న మందుగుండును స్వాధీనం చేసుకోవటం పోలీసుల పాలిట శాపమైంది. పోలీసులు సీజ్ చేసిన మందుగుండును నిర్వీర్యం చేసే సమయంలో భారీ పేలుడు సంభవించింది. మందుగుండును నిర్వీర్యం చేసే సమయంలో పేలుడు సంభవించడంతో ఇద్దరికి గాయాలు కాగా పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఇళ్లు ధ్వంసం కావడంతో అక్కడి స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు.
 
పేలుడు జరిగిన సమయంలో ఇళ్ల నుండి బయటకు వచ్చిన జనం పోలీసుల నిర్లక్ష్యం వలనే తమ ఇళ్లు దెబ్బ తినటంతో కోపోద్రిక్తులయ్యారు. పోలీసులు చేసిన పని వలన తమ ఇళ్లు దెబ్బ తిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు చెందిన రెండు వాహనాలను స్థానికులు దగ్ధం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉన్నాతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించారు. 
 
చాలా రోజుల నుండి అక్రమంగా తయారవుతున్న మందుగుండు గురించి ఫిర్యాదులు రావడంతో పోలీసులు అక్రమంగా తయారు చేస్తున్న మందుగుండు కేంద్రాలపై దాడులు జరిపారు. కానీ నిర్వీర్యం చేసే క్రమంలో పేలుడు సంభవించడంతో స్థానికుల నుండి ఆగ్రహం వ్యక్తమైంది. భారీ స్థాయిలో మండే పదార్థం ఉండటం వలనే పేలుడు సంభవించిందని పోలీసులు చెబుతున్నారు. 
 
ఈ ఘటనలో గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా క్రాకర్స్ తయారు చేస్తూ ఉండటంతో తాము దాడులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. స్థానికులు తమ ఇళ్లు కూలిపోయాయని పాక్షికంగా ధ్వంసమయ్యాయని తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం సహాయం అందించేలా తమ వంతు ప్రయత్నాలు చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వైద్యులు ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: