ట్విట్టర్ ఈ పేరు చెబితే ఈ దేశంలో ఉండేటువంటి కుర్రాళ్ళకి అమ్మాయిలకి అబ్బాయిలకి కాదు సినిమా ప్రియులకే  కాదు రాజకీయవేత్తలు కూడా చాలా చాలా జోష్ వస్తుంది.  వాళ్ళతో సమానంగా   వీళ్ళందరూ హడావిడిగా తమ టాలెంట్ చూపించడానికి సిద్ధమైపోతున్నారు.  పొలిటికల్ లీడర్స్  అయినటువంటి లోకేష్ , పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా చాలా సార్లు  తమ మనసులో మాటలు చెప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు ట్విట్టర్లో.  ప్రస్తుతం ట్విటర్ లో  టిడిపి వెర్సెస్ వైకాపా లాగా వ్యవహారాలు నడుస్తున్నాయి,  ఇవి ఎంత వరకు వెళతాయి ..  ప్రజలకి ఎటువంటి ఉపయోగం ఇస్తాయి అనేది తెలియదు.  

 

 

కానీ టైమ్ పాస్ గా  రాజకీయనాయకులకి ఇది ఒక రకమైన అలవాటుగా మారిపోయింది.  ఇంతకీ మనం ఇంతగా ట్విటర్ గురించి  ఎందుకు మాట్లాడుకుంటునాం అంటే .. రీసెంట్గా విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు విపరీతంగా ఉన్నాయి . రీసెంట్గా ట్విట్టర్లో ఆయన చంద్రబాబు టార్గెట్ గా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. "అప్పుడు వ్యవసాయం దండగ ఉచిత కరెంటిస్తే వైర్ల పై బట్టలు ఆరేసుకోవడం తప్ప సరఫరా ఉండదని హేళన చేశాడు. సహకార పాల సంఘాలన్నిటిని దెబ్బకొట్టి తన హెరిటేజ్ డెయిరీని డెవలప్ చేసుకున్నాడు. ఇప్పుడు బినామీల భూముల కోసం రైతుల పేరుతో నాటకాలాడుతున్నాడు. వాటే విజన్ బాబ్జీ! "  అంటూ బాబు పై ఫైర్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం చాలా పెద్ద వైరల్ అయింది.  ఎందుకంటే చంద్రబాబు నాయుడిని మాస్ గా లేక క్లాస్ గా ఏదైనా సరే విమర్శించాలి అంటే అది కేవలం విజయసాయిరెడ్డి వల్ల లేక కొడాలి నాని వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అనేక సార్లు రుజువైంది .

 

 

భూముల కోసం చంద్రబాబు నాయుడు నాటకాలు ఆడుతున్నాడు అన్నంత వరకూ  జగన్మోహన్ రెడ్డి ఫాన్స్ ఈ వ్యవహారాన్ని  సీరియస్గా తీసుకున్నా కూడా ..  ఆ తర్వాత వాట్ ఏ విజన్  'బాబ్జి' అంటూ కొత్త నిక్ నేమ్ పెట్టడంతో విజయసాయిరెడ్డి వేసినపంచ్ చూసి నేరుగా జగన్మోహన్రెడ్డి దగ్గరకి కూడా వెళ్లింది అనీ ఆయన కూడా ఆ కొత్త నిక్ నేమ్ కి  పడిపడి నవ్వారు అంటున్నారు.  దీంతోపాటుగా చిత్తూరు జిల్లాలో జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన 'జగన్ అన్న అమ్మ ఒడి పథకం' పైన కూడా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు . ఒక చారిత్రాత్మక పథకం అని ఆయన కొనియాడారు రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశలో అమ్మ ఒడి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పాజిటివ్ సిగ్నల్ ఇచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: