ఒక నిర్లక్ష్యం ఖరీదు నిండు జీవితం అయితే, అదే నిర్లక్ష్యం ఖరీదు ఒక్కోసారి అనుకోని లాభాలను తెచ్చిపెడుతుందని ఇప్పుడు మీరు చదవబోయే విషయంలో ఇదే తెలుస్తుంది. ఇకపోతే విక్రం నటించిన అపరిచితుడు సినిమా దాదాపు అందరు చూసే ఉంటారు. అందులో రామం అనే క్యారెక్టర్లో విక్రం నటించిన తీరు అద్భుతం. అంతే కాదు ఆపాత్ర విషయానికి వస్తే అసలు ఇలాంటి వాళ్ళు లోకంలో ఉంటారా అనే అనుమానం తప్పక కలుగుతుంది.

 

 

ఎందుకంటే బండి క్లచ్ వైరు తెగిపోతే ఆ వైర్ కొన్న షాపుకి వెళ్లి, వైరు కంపెనీ అడ్రస్ తీసుకుని సదరు కంపెనీపై కోర్టులో పిల్ వేసి వైరు నాణ్యత లేదని చెప్పి నష్టపరిహారం పొందుతాడు. తనకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని కంపెనీపై కేసు ఫైల్  చేయిస్తాడు. అయితే అది సినిమా కబట్తి అలా జరిగింది. ఇదే నిజ జీవితంలో ఇలా అసలు జరగదు అని అనుకోని వారు ఉండరు. కానీ అమెరికాలోని ఓ జంట ఇలానే ఒక కంపెనీపై పోరాడింది. తాము కోల్పోయిన తమ బిడ్డ ఎలాగో రాదు కాబట్టి ఆ కంపెనీ కి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని. పట్టిన పట్టు విడవకుండా పోరాడి చివరకు అనుకున్నది సాధించారు.. అదెంటో చూస్తే.

 

 

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఐకియా సంస్థ కి చెందిన ఒక అతిపెద్ద షో రూమ్ ఉంది. అయితే షో రూమ్ లో షాపింగ్ చేయడానికి స్థానికంగా ఉండే ఇద్దరు భార్యా భర్తలు వెళ్ళారు. అక్కద వారి ఒక్కగానొక్క రెండేళ్ళ  పిల్లాడు జోసెఫ్ ఆడుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న బీరువా కి ఉన్న డ్రస్సర్ ని లాగాడు. దాంతో ఒక్కసారిగా అది ఊడి పిల్లాడిపై పడిపోవడంతో అక్కడికక్కడే ఆ బాబు మృతి చెందాడు. బాలుడు మరణించాడని ఆ దంపతులు ఊరుకోక మా పిల్లాడు చనిపోవడానికి కారణం డ్రస్సర్ ని తయారు చేసిన కంపెనీ తయారీ లోపం అని గట్టిగా వాదించారు.

 

 

అందుకు నష్టపరిహారంగా తమకి 300 కోట్ల రూపాయలు చెల్లించాలని కేసు వేశారు. ఈ కేసుపై పలు మార్లు విచారణ జరిపిన న్యాయస్థానం ఎట్టకేలకి సదరు కంపెనీ మరణించిన బాబు కుటుంబానికి 300 కోట్లు చెల్లించాల్సిందేనంటూ తీర్పు చెప్పింది. ఇకపోతే ఈ ఘటన అంతా సుమారు రెండేళ్ళ క్రితం జరిగిందట..  

మరింత సమాచారం తెలుసుకోండి: