అమరావతి విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అంటూ  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు నాపై  కోపం ఉంటే నన్ను బాధ పెట్టకండి తట్టుకుంటాను. కానీ నా మీద ఉన్న కోపం  అమరావతి పై చూపించవద్దు అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో మచిలీపట్నం లో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. 

రైతులు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూమిని రియల్ ఎస్టేట్ అంటున్నారని ,రైతులు గుండె ఆగి చనిపోతే మీకు బాధ అనిపించడం లేదా ?  కనీసం రైతుల కుటుంబాలను ఇప్పటి వరకు ఎవరూ పరామర్శించ లేదు అంటూ బాబు విమర్శించారు. అమరావతి బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటిది అని మీరు అనవసరంగా దాన్ని వదిలేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 


మూడు రాజధానులని ప్రజలను గందరగోళంలోకి నెట్టారని, అసలు మాకు రాజధాని కావాలని విశాఖ ప్రజలు మిమ్మల్ని ప్రజలు అడిగారా ? ఇక్కడ రైతులకు అన్యాయం చేయాలని మీరు చూస్తున్నారంటూ మండిపడ్డారు. పెట్టుబడులు పెడతామని  కోరుతూ వచ్చిన వారిని విశాఖలో వెనక్కి పంపించారు కదా అని ప్రశ్నించారు. బందరు పోర్టుకు సీఎం జగన్ అన్యాయం చేశారని, సీఎం జగన్ పథకాలు నవరత్నాలు కాదు నవగ్రహాలు అంటూ విమర్శించారు. 


అందరూ వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తోంది అని, బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా వయస్సు అయిపోయిందని మీ పార్టీ నాయకులంతా అవహేళన చేస్తున్నారని, మీ 151 మంది ఎమ్యెల్యేలు నన్ను చూసి భయపడుతున్నారని బాబు అన్నారు. మీ ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీలో మొత్తం వెన్నుముక లేని మంత్రులే ఉన్నారని, మీరు ఎలా ఇమ్మంటే అలా రిపోర్ట్ వారు ఇస్తారు తప్ప ఇంకా ఏమీ చేయలేరని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: