దేశంలో విధ్వంసం సృష్టించాలనుకున్న ఉగ్రవాదుల భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. జమ్మూకశ్మీర్‌లో దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించే ఉగ్ర మూకల కుట్రలను భద్రతాబలగాలు ఎప్పటికప్పుడు పసిగట్టి భగ్నం చేస్తున్నాయి. అయితే ఎప్పుడు జమ్మూకాశ్మీర్ లో ఉగ్ర కుట్రలు చేసే ఉగ్రవాదులు ఈసారి ఢిల్లీలో చేశారు.   

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని వజీరాబాద్‌లో ఉగ్రస్థావరం ఉన్నట్లు కనుగొన్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులకు పాల్పడ్డ పోలీసులు ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ నిందితులను దేశ రాజధానిలో అరెస్టు చేయడం ఇదే మొదటిసారి అవ్వడం గమర్హం. 

 

ఈ ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో ఇవాళ ఉదయం జరిగిన ఓ ఎన్‌కౌంటర్ తర్వాత ఐఎస్ఐఎస్‌తో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడినట్టు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసుల వర్గాలు తెలిపాయి. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

అంతేకాదు..  భారత్ లో ఉగ్రవాద దాడులు నిర్వహించేందుకు జమ్మత్ ఉల్ ముజాహిద్దీన్ అనే బంగ్లాదేశ్ టెర్రర్ గ్రూప్‌కి పాకిస్థాన్ నిధులు సమకూరుస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందింది. ఐఎస్‌ఐ మోనెటరింగ్‌లో భారత్‌లో ఉగ్ర దాడులకు జరిపేందుకు బంగ్లాదేశ్‌లోని రోహింగ్యాలకి శిక్షణ ఇస్తున్నటు సమాచారం. 

 

జీ మీడియా యాక్సెస్ తెలిపిన నివేదిక ప్రకారం, ఐఎస్ఐ తన దుర్మార్గపు మిషన్ కోసం బంగ్లాదేశ్ యొక్క కాక్స్ బజార్లో ఉంటున్న దాదాపు 40 మంది రోహింగ్యాలను నియమించింది. బంగ్లాదేశ్‌లో అత్యంత ఘోరమైన టెర్రర్ గ్రూపు జెఎమ్‌బి ఈ శిక్షణ ఇస్తోంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇప్పటికే మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద జెఎంబికి  కోటి రూపాయిలు ఇచ్చినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: