ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో హామీలను నెరవేరుస్తూ వస్తున్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని నేడు నెరవేర్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడి పథకం చిత్తూరు జిల్లా వేదికగా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని పేద విద్యార్థులందరు  బడికి వెళ్లి చదువుకోవాలనే  ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి  పథకానికి శ్రీకారం చుట్టారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పుడు వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 

 

 

 ఇక చిత్తూరు వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ప్రారంబించిన వెంటనే  15 వేల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో లబ్ధిదారులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఇకపోతే తాజాగా నేడు ప్రారంభమైన అమ్మ ఒడి పథకం పై జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం లో పారదర్శకత లోపించిందని ఆయన ఆరోపించారు. 

 

 

 ఈ పథకం విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యూ టర్న్  తీసుకుంటున్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ద్వారా 65 లక్షల మంది తల్లులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని వైసీపీ నేతలు గతంలో చెప్పారని... కానీ ఇప్పుడు ఆ సంఖ్య నలభై మూడు లక్షలకు కుదించారు  అంటూ విమర్శలు గుప్పించారు జనసేన నేత  నాదెండ్ల మనోహర్. మాయమాటలు చెప్పి జగన్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోంది అంటూ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: