ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి లో రైతులు నిరసన బాట పట్టిన  విషయం తెలిసిందే. తీవ్ర స్థాయిలో రైతులు రైతు కుటుంబీకులు రోడ్ల పైకి చేరి నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి  వెంటనే రాజధాని  మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు . ఇకపోతే అమరావతి లో రైతులు నిరసన కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటిస్తూన్న  విషయం తెలిసిందే. అమరావతి కోసం ఏకంగా విరాళాలు కూడా చేపడుతున్నారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే మచిలీపట్నం ప్రజా చైతన్య యాత్ర లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. 

 

 

 

 రాజధాని అమరావతి కోసం జోలు  పడితే ముసలి ముతక వాళ్లు కూడా 100 50 పది రూపాయలు కూడా తీసుకువచ్చి జోలులో  వేశారని చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తో పాటు స్థానిక మంత్రి పేర్ని నాని పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. సీఎం జగన్ గారు రైతుల మరణాలు ఆవేదన చూస్తుంటే మీకు బాధ అనిపించడం లేదా... ఇక్కడుండే నాని నీకు బాధ కలగడం లేదా అంటూ ప్రశ్నించారు. అసలు నీకు ఎందుకు మంత్రి పదవి.. రాజధాని మార్చుతుంటే  సిగ్గు లేకుండా ఆ కమిటీలో ఉన్నావు నీకెందుకు మంత్రి పదవి అంటూ విరుచుకు పడ్డారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. 

 

 

 మీ లాంటి వాళ్ళ మాకు నీతులు చెప్పేది... ఇంకా మీరు నన్ను తిడుతున్నారు కూడా. ఇవాళ ఒకాయన తిట్టారు నేను లుచ్చాల  కనిపిస్తున్నాన ఆయనకి. పర్వాలేదు నన్ను ఎంతైనా తిట్టండి బాధ పెట్టండి కానీ నా మీద ఉన్న కోపాన్ని ప్రజల పైన అమరావతి పైన మాత్రం చూపించొద్దు అంటూ చంద్రబాబు హితవు పలికారు. రాజధాని నిర్మాణం కోసం ఒక్క పిలుపు ఇస్తే 33 వేల ఎకరాలు ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూలింగ్ లో  ఇచ్చారు. కానీ జగన్ సర్కార్ ఏమో రియల్ ఎస్టేట్ అంటున్నారు అంటూ ఆరోపించారు చంద్రబాబు నాయుడు. అమరావతి కోసం నిరసన తెలుపుతూ ఆవేదనతో రైతుల గుండె ఆగి చనిపోతుందే మీకు సిగ్గు అనిపించడం లేదా... అసలు మనుషులేనా అంటూ విరుచుకుపడ్డారు చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: