అమరావతి లో రైతులు అందరు నిరసన బాట పట్టిన  విషయం తెలిసిందే. తీవ్ర స్థాయిలో రైతులు రైతు కుటుంబీకులు రోడ్ల పైకి చేరి నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి  వెంటనే రాజధాని  మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు . ఇకపోతే అమరావతి లో రైతులు నిరసన కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటిస్తూన్న  విషయం తెలిసిందే. అమరావతి కోసం ఏకంగా విరాళాలు కూడా చేపడుతున్నారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మచిలీపట్నం ప్రజా చైతన్య యాత్ర లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై నిప్పులు చెరిగారు చంద్రబాబు. 

 

 

 

 జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పవన్ నాయుడు అంటారా  మరి ఈ నాని ఏమని అనాలి  నాని రెడ్డి అనా.. లేక జోసెఫ్  నాని అనా.. జాన్ నానీ అనా  అంటూ సెటైర్లు వేశారు చంద్రబాబు నాయుడు. మాట్లాడేందుకు నోటికి హద్దు ఉండాలి అంటూ హితవు పలికారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు... పవన్ కళ్యాణ్ స్వ శక్తితో పైకి వచ్చిన వ్యక్తి కానీ  మీరు మాత్రం రాష్ట్రాన్ని దోపిడీ చేసి పైకి వచ్చిన వ్యక్తులు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. నేను జోలె  పట్టడాని కూడా చాలా మంది అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నా అవసరం కోసం కాదు సమాజం కోసం జోలె  పట్టాను అంటూ చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి అంటూ పిలుపునిచ్చారు.

 

 

 ఈ విషయంలో స్వార్థంతో ఉండవద్దని స్వార్థంతో ముందుకెళ్ళుంటే మహాత్మాగాంధీ స్వాతంత్రం సాధించెవాడు కాదు అంటూ హితవు పలికారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. బ్రిటిష్ వాళ్ళ హింస కు భయపడి ఉంటే గాంధీ పోరాటం చేసే వాడు కాదు. ఇప్పుడు కూడా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతుందని వాటికి భయపడతామా... కేసులకు భయపడి ఉద్యమాన్ని ఆపుతామా  అంటూ ప్రసంగించారు చంద్రబాబు నాయుడు. ఇకపోతే అమరావతి మొత్తం రోజురోజుకు అట్టుడుకుతోంది ఇక అమరావతి రైతులందరికీ ప్రతిపక్ష టీడీపీ కూడా మద్దతు పలకడంతో అమరావతి రైతులు తీవ్ర స్థాయిలో ధర్నాలు రాస్తారోకోలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: