అమరావతి రాజధాని అంశం తెలుగు  ప్రజలు అందరికీ అతి పెద్ద టాపిక్ గా మారిపోయింది . ఇప్పుడు మొత్తం 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఏ తెలుగు వ్యక్తిని,  తెలుగు ఓటర్ ని కదిపిన దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.  అమరావతి మీద ఎవరికి వారు సలహాలు సూచనలు ఎక్కువ అయిపోయాయాయి.  జగన్ మోహన్ రెడ్డి  ఈ యొక్క అమరావతి విషయాన్ని మూడు రాజధానుల అంశాన్ని ఎలా డీల్ చేస్తే బాగుంటుంది అనేది ఎవరికి వారు సలహా గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.  ఇందులో భాగంగా కొంతమంది రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలి అని అతిపెద్ద నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయి.  గత మూడు వారాలుగా అమరావతి రైతులు నిరసనలు ధర్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో ఏపీ రాజధానిగా అమరావతి నే కొనసాగించాలంటూ రైతులు వారి కుటుంబ సభ్యులు ప్రధాని మోడీ నిర్వహించే  మన్ కీ బాత్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఫోన్లు చేశారు రాజధాని అమరావతిని కాపాడాలి అని విజ్ఞప్తి చేశారు.  రాష్ట్ర రాజధాని కోసం భూములు పెద్దఎత్తున త్యాగం చేశామని,  ఈ పరిస్థితిని అర్థం చేసుకుని  కాపాడాలి అని నేరుగా అందరూ ప్రధానికి విన్నవించుకున్నారు . తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రధాని దృష్టికి వెళ్తే కేంద్రం నుంచి ఏదైనా చిన్నపాటి నిర్ణయమైన వెలువడుతుందని రైతులు భావిస్తున్నారు.

 

 

 దేశ ప్రజలను ఉద్దేశించి  ప్రధాని మోడీ క్రమం తప్పకుండా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీరంతా టార్గెట్ చేశారు.  మోడీ ఎప్పుడూ మాట్లాడే ఆల్ ఇండియా రేడియో,  డిడి నేషనల్,  డిడి న్యూస్ ద్వారా ఆయన ప్రజలతో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చేస్తారు . ఈ అంశంపై ఎప్పుడు ఎలా మాట్లాడాలి అనేది కూడా ఆ విషయాన్ని అభిప్రాయాలని ప్రజల నుంచే తెలుసుకుంటారు.  ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక నెంబర్లు కూడా ఉంటాయి . ఆ నెంబర్ కి ఫోన్ చేసి ప్రజలు సలహాలు కూడా ఇవ్వొచ్చు..  తెలుగు నేల పై జరుగుతున్న ఒక కీలక ఉద్యమం గురించి ప్రధాని మాట్లాడాలి అంటే మన్ కీ బాత్ కి సంబంధించి అనేక రకాల నెంబర్లు ఫోన్ లో వెళుతున్న సంగతి మనం ఇప్పుడు చూస్తున్నాము .

 

 

వాట్సాప్ లో ఒక మేటర్ విపరీతంగా వైరల్ అవుతోంది .. " నేను ఇప్పుడే ప్రధానికి తెలియజేశాను మీరు వెంటనే చేయండి .. ఈ నెంబర్ 1 8 0 0 1 1 7 8 0 0 నెంబర్ కి వెంటనే ఫోన్ చేసి ఫోన్ చేసిన తర్వాత రికార్డు మెసేజ్ అయిన తర్వాత,  బీప్ సౌండ్ వస్తుంది మొదట మీ పేరు మీ ఊరు మీ రాష్ట్రం చెప్పండి తర్వాత ' అమరావతి రైతుల కోసం పోరాటం చేస్తున్నామని' మెసేజ్ ని ఇక్కడ పంపించండి అంటూ ఒక వాట్సాప్ మెసేజ్ ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది.  ఈ మెసేజ్ ని ఫోన్ లో ఆ నెంబర్ కి  ఎన్నో లక్షలమంది పంపిస్తున్నారు అనేది నిజమైతే త్వరలోనే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ దీని మీద స్పందించడం తప్పకుండా జరుగుతుంది. మోడి గనక స్పందిస్తే జగన్ - చంద్రబాబు ల పరిస్థితి ఏంటో వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి !! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: