జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ఎవరికీ తెలీని నిజాన్ని చంద్రబాబునాయుడు  బయటపెట్టారు.  అమరావతి ఆందోళన కోసం విరాళాలు సేకరించటానికి జేఏసి తరపున చంద్రబాబు అండ్ కో మచిలీపట్నంలో జోలె పట్టుకుని తిరిగారు. ఆ సందర్భంగా జనాలనుద్దేశించి మాట్లాడుతూ పవన్ పోరాటాలు చేసిన వ్యక్తి అంటూ చెప్పారు. పవన్ గురించి చంద్రబాబు చెప్పిన మాటలు విని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

 

నిజానికి చంద్రబాబు మాటలు విన్న తర్వాత పవన్ కూడా ఆశ్చర్యపోయే ఉంటారనటంలో సందేహం లేదు. ఎందుకంటే పవన్ చేసిన పోరాటాలేంటో ? ఎవరికీ తెలీని పోరాటాలు ఏమి చేశారో జనాలకు అర్ధం కాలేదు. ఎవరికీ తెలీని పోరాటాలు తనకు  మాత్రమే తెలిసిన పోరాటం ఏమిటో మరి చంద్రబాబే చెప్పాలి. పోరాటాలు చేశాడని చెప్పాడే కానీ ఆ పోరాటాలేమిటి అని మాత్రం వివరించలేదు.

 

బహుశా తాను అధికారంలో ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డి పై పవన్ చాలా పోరాటాలే చేశాడనిచంద్రబాబు అనుకునుంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ ఎప్పుడు ఆందోళనలు చేసినా వెంటనే పవన్ రంగంలోకి దిగిన  సందర్భాలు చాలానే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టును చూడటానికి వైసిపి ఎంఎల్ఏలు  ప్రోగ్రాం పెట్టుకోగానే  హఠాత్తుగా అదే రోజు వాళ్ళకన్నా ముందే ప్రాజెక్టు దగ్గరకు పవన్ వెళ్ళాడు.

 

విశాఖపట్నం జిల్లాలో జగన్ ఆందోళన కార్యక్రమం పెట్టుకోగానే వెంటనే పవన్ వెంటనే భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ (బిహెపివి) కార్మికుల సమస్యపై విశాఖపట్నం వెళ్ళి సభ పెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ఎన్నికల సమయంలో కూడా రాష్ట్రంలో తిరిగిన పవన్ ఎన్నికల్లో జగన్ ను ఓడించమని నేరుగానే చాలా సభల్లో పిలుపిచ్చారు.

 

అయితే జనాలు మాత్రం చంద్రబాబు+పవన్ ఇద్దరినీ కలిపి ఉతికారేశారు లేండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ చేసిన పోరాటాలన్నీ చంద్రబాబు తరపున చేసినవే. అందుకనే అంతగా భుజానేసుకుని ఊరేగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: