భారత న్యాయవ్యవస్థ చాలా ఘోరంగా తగలడి చచ్చిందని ప్రజలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. తప్పుచేసింది వయసులో చిన్నవాడైన, ఆర్థికస్థాయిలో పెద్దవాడైన సరే వాడి నేపథ్యం చూడకుండా మన చట్టాలు తగిన శిక్షను ఎప్పుడు విధిస్తుందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. 

 

తాజాగా ఒక కేసుకు సంబంధించిన తీర్పు వింటుంటే మన న్యాయవ్యవస్థ లేకపోవడమే మిన్నా అనిపిస్తుంది. 2016వ సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో ఒక 17సంవత్సరాల యువకుడు.. సిద్దార్థ్ శర్మ అనే 32ఏళ్ల యువకుడిని కారు తో గుద్ది చంపేశాడు. నిజానికి నిందితుడు కరెక్టు వయసు 4రోజులు తక్కువ 18సంవత్సరాలు. దాంతో, అతడిని బాలనేరస్థుడిగా పరిగణించింది సుప్రీంకోర్టు. వాస్తవానికి, ఈ నిందితుడు ఒకరిని చంపక ముందు తన తండ్రి మెర్సిడెస్ కారుని ఇష్టారాజ్యంగా నడుపుతూ ట్రాఫిక్ రూల్స్ ని ఉల్లంగింస్తూ 3 సార్ల వరకు ఫైన్ చెల్లించాడు. 

 

అయితే, ఈరోజు సుప్రీంకోర్టు ఇతడికి ఒక్కరోజు కూడా జైల్లో గడపాల్సినవసరం లేదని తేల్చి చెప్పేసింది. అతన్ని బాల్యదశగా విచారించి, దోషిగా తేలితే, పరిశీలనలో ఉంచాలని చెప్పుకొచ్చింది. 

 

'మేము ఒక పజిల్ ని పరిష్కరించడం లేదు ... మేము ఒక చట్టంలో పదాన్ని జోడించలేము లేదా ప్రత్యామ్నాయం చేయలేము. రెండు వ్యాఖ్యానాలు సాధ్యమైనప్పుడు, బాల్య ప్రయోజనాల కోసం ఒకదాన్ని అవలంబించాలి', అని జస్టిస్ దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. తీర్పుని చదివేటప్పుడు, జస్టిస్ గుప్తా, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద ఆరోపించిన నేరం 'ఘోరమైన' నేరం కిందకు రాదని అన్నారు. న్యాయమూర్తి మాట్లాడుతూ చట్టపరమైన నిబంధన స్పష్టంగా ఉన్నప్పుడు, లేకపోతే దానిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. "మేము చట్టానికి కట్టుబడి ఉన్నాము" అని ఆయన చెప్పారు.

 

అయితే, కనీస శిక్షను సూచించని నేరాలతో వ్యవహరించే చట్టపరమైన నిబంధన యొక్క వివరణ గురించి ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుబడుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ప్రస్తుత కేసులో, ఈ నిందితుడు నేరపూరిత నరహత్యకు పాల్పడలేదని కాబట్టి ఐపిసి సెక్షన్ 304 కింద అరెస్ట్ చేసారు. అయితే, సెక్షన్ 304 ప్రకారం గరిష్ట శిక్ష జీవితకాలం 10 సంవత్సరాల వరకు రెండు వేర్వేరు నేరాల కింద జైలు శిక్ష విధించినప్పటికీ, అసలు కనీస శిక్ష అనేది లేదు.

 

ఈ చర్య యొక్క ప్రమాదాల గురించి, అతని మానసిక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అపరాధిని పెద్దవాడిగా విచారించాలని జువెనైల్ బోర్డు అభిప్రాయపడ్డారు, కానీ ఢిల్లీ హైకోర్టు దీనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వును మృతుడు సోదరి సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

 

కనీస శిక్షను విధించని నేరాలకు ఎలా వ్యవహరించాలో జువెనైల్ జస్టిస్ యాక్ట్ చెప్పకుండా మౌనంగా ఉందని చూపించడానికి సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లుథ్రా తన వంతు ప్రయత్నం చేశారు. ప్రస్తుతము చట్టాన్ని వ్యాఖ్యానించడానికి తగిన కేసు అని వాదించాడు, అది ఘోరమైన నేరాల వర్గంలోకి రావాలని డిమాండ్ చేసారు. అయితే కోర్టు లుథ్రాతో ఏకీభవించలేదు. ఇది ఐపిసి క్రింద నాల్గవ వర్గం నేరాలను సూచిస్తుందని..ఇందులో కనీస శిక్షలు లేవుని ఎందుకంటే వాటిని ఘోరమైన నేరాలుగా చట్టం తెలియపరచట్లేదని చెప్పుకొచ్చింది న్యాయస్థానం. 

 

జస్టిస్ గుప్తా మాట్లాడుతూ పార్లమెంటు ఈ లాకునాను పూరించడానికి చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేసారు. సవరణలు తీసుకురావాలని అత్యున్నత న్యాయస్థానం చట్టసభ సభ్యులపై విజ్ఞప్తి చేసింది, కాని ఈ కేసులో నిందితుడిని మాత్రం పెద్దవాడిగా విచారించలేమని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: