మంత్రిగా గతం లో  జిల్లాను శాసించిన ఆయన ఎమ్మెల్యేగా ఓటమిపాలయి , మంత్రి పదవి చేజారడం తో ఇప్పుడు సొంత ఇలాకా లో అనుచరులకు మున్సిపోల్స్ లో టికెట్లు ఇప్పించుకోలేని దుస్థితిలో ఉన్నారు . గత టీఆరెస్  ప్రభుత్వ హయాం రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు . ముందస్తు అసెంబ్లీ  ఎన్నికల్లో అయన , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు .

 

ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపధ్యం లో పైలెట్ రోహిత్ రెడ్డి కూడా టీఆరెస్ లో చేరారు .  మున్సిపోల్స్ లో అభ్యర్థుల ఎంపిక , గెలుపు బాధ్యత ఎమ్మెల్యేల భుజస్కందాలపై టీఆరెస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ మోపిన విషయం తెల్సిందే . దీనితో తాండూర్ మున్సిపాలిటీ లో తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవాలంటే ,  తాను రోహిత్ రెడ్డి కి సిఫార్సు చేయాల్సిన పరిస్థితి నెలకొనడం తో మహేందర్ రెడ్డి పరిస్థితి ఇబ్బందికరంగా తయారయింది .

 

ఒకవేళ తాను సిఫార్సు చేసిన రోహిత్ కాదంటే ... అంతకంటే అవమానం మరొకటి ఉండదని భావిస్తోన్న మహేందర్ రెడ్డి తన అనుచరులకు మన టైం వచ్చే వరకు వేచి చూద్దాం అంటూ సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది . నిన్న , మొన్నటి వరకు జిల్లాను శాసించిన తనకు ఇటువంటి పరిస్థితి రావడం జీర్ణించుకోలేకపోతున్నారని సన్నిహితులు చెబుతున్నారు . మహేందర్ రెడ్డి కి ఈ పరిస్థితి రావడానికి పరోక్షంగా ఆయన కు అత్త, ప్రస్తుత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కారణమని ఆరోపిస్తున్నారు .

 

కాంగ్రెస్ తరుపున గెల్చిన  సబిత కనుక టీఆరెస్ లో చేరి ఉండి, ఉండకపోతే మళ్ళీ ఎమ్మెల్సీగా గెల్చిన మహేందర్ రెడ్డి కి మంత్రి పదవి దక్కి ఉండేది అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: