నారా లోకేశ్. నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు. అంతేనా.. నందమూరి బాలకృష్ణ ఇంటి అల్లుడు. అంతేనా.. నందమూరి తారక రామారావు గారి మనవడు. ఇలా అన్నివైపులా వారసత్వాలు ఉన్న నాయకుడు నారా లోకేశ్. పాపం. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా రాజకీయాల్లో మాత్రం రాణించలేకపోతున్నారు. పెద్దగా రాణించకపోగా.. పప్పు అనే ముద్ర వేయించుకున్నారు.

 

నారా లోకేశ్ ను ప్రత్యర్థులు పప్పు అని విమర్శించడం మామూలే. చివరకు గూగుల్ లో పప్పు అని కొడితే నారా లోకేశ్, రాహుల్ గాంధీ బొమ్మలే వచ్చే రేంజ్ లో ఆ పేరు పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఆ పేరు పాతబడిపోయిందనో ఏమో.. కొత్త పేరు ప్రచారంలోకి తెస్తున్నారు వైసీపీ నేతలు. అదేంటంటే అంబోతు. వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పదం వాడారు లోకేశ్ కోసం.

 

ఆయన ఏమన్నారంటే.. “ లోకేష్‌ ఆంబోతు ప్రభుత్వం అంటున్నాడు. నీకంటే ఆంబోతులు ఎవరున్నారయ్య బాబూ.. ఇష్టారీతిగా మాట్లాడుతున్నాడు. నీకంటే ఆంబోతు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడా..? ఎందుకు అలాంటి భాష వాడడం, అందరం ప్రజా ప్రతినిధులం.. నీలా మీ నాన్నతో ముద్ర వేయించుకొని రాలేదు. ప్రజలు ఎంచుకున్నారు కాబట్టే ఇక్కడున్నాం. రైతుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తాం. ఈ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో విశాఖ ఒకటి. అక్కడ అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందినట్లే.. అంటూ లోకేశ్ కు అంబోతు అనే బిరుదు ప్రజంట్ చేశారు.

 

ఆయన ఇంకా ఏమన్నారంటే.. “ వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు విశాఖలో భూములు కొన్నారని అంటున్నారు. మా ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతుంది. హుద్‌హుద్‌ తుఫాన్‌ పేరుతో టీడీపీ దోచుకుతిన్నది. దోపిడీ కోసం మంత్రులు కొట్టుకున్నారు. అలాంటి నీచ చేష్టలు చేసి ఇవాళ మాట్లాడుతున్నారు. భూముల రికార్డులు మార్చేశారు. ఇలాంటి వెధవ పనులు చేయబట్టే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన విధానం, బాధ్యత ఉంది. ఆ బాధ్యత ప్రకారం సీఎం వైయస్‌ జగన్‌ ముందుకు వెళ్తారు.. అన్నారు మంత్రి బొత్స.

మరింత సమాచారం తెలుసుకోండి: