ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలపై ఆంధ్ర ప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు . ఉత్తరాంధ్ర టీడీపీ నేతలవి బతుకులేనా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు .   ఉత్తరాంధ్ర టీడీపీ నేతలపై ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి కారణం ... ఆ పార్టీ నేతలు విశాఖలో రాజధానికి మద్దతుగా ముందుకు రాకపోవడమేనని తెలుస్తోంది . జీఎన్ రావు నేతృత్వం లోని నిపుణుల కమిటీ , బోస్టన్ నివేదికల సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు కు సుముఖంగా ఉంది.

 

ఇక  విశాఖపట్నం ను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిపాదించిన విషయం తెల్సిందే . అయితే   రాజధానిని తరలించడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు .  విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయమని ఎవరు కోరారని ఆయన  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు . విశాఖను రాజధానిగా ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటున్న  తమ్మినేని సీతారాం , తమ పార్టీ నాయకత్వం విధానానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు స్పందించకపోవడం పట్ల ఆగ్రహంతో రగిలిపోతున్నారు .   విశాఖను రాజధానిగా ప్రకటించడాన్ని తమ్మినేని కంటే ముందే  టీడీపీ నేతలు , ప్రజాప్రతినిధులు స్వాగతించారని ఆ పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి  .

 

విశాఖకు రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్న విషయాన్నీ ఈ సందర్బంగా ప్రస్తావిస్తున్నారు  .  ఇక పార్టీ లైన్ కు భిన్నంగా మాజీ మంత్రి కొండ్రు మురళి కూడా స్పందిస్తూ, విశాఖను రాజధానిగా చేయాల్సిందేనని కోరారు . పార్టీ విధానం  ఏదైనా తాము తమ ప్రాంత ప్రయోజనాలకు అనుగుణంగానే మాట్లాడుతామని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పేర్కొంటున్నారు . అయినా  టీడీపీ నేతలపై  తమ్మినేని అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: