వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. అవ్వకముందు ఎన్నికల సభల్లోనూ ఎల్లో మీడియా అంటూ చంద్రబాబు అనుకూల పత్రికలను టార్గెట్ చేస్తూనే వచ్చారు. ఎలాంటి మొహమాటం లేకుండా చంద్రబాబు అనుకూల పత్రికలు, ఛానళ్లను పేరు పెట్టి విమర్శిస్తున్నారు. సీఎం అయిన తర్వాత కూడా జగన్ ఎక్కడా తగ్గలేదు. ప్రమాణ స్వీకారం రోజే.. ఏకంగా ఎల్లో మీడియా గురించి ప్రజలను అప్రమత్తం చేశారు.

 

తన పాలన పై ఎల్లో మీడియా బురద జల్లుతుందని జగన్ కు తెలియందేమీ కాదు. అందుకే ఇష్టానుసారం కథనాలు రాసే పత్రికలపై కేసులు పెట్టే అధికారం ఏకంగా అధికారులకే వదిలేశాడు. దీనిపై పత్రికాస్వేచ్ఛపై దాడి అంటూ సదరు పత్రికలు కొంత పోరాటం చేసినా జగన్ వెనక్కు తగ్గలేదు. ఇక ఇప్పుడు అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్న క్రమంలో ఎల్లో మీడియాతో జగన్ యుద్ధం మరింత జోరందుకుంది.

 

అమరావతి నుంచి రాజధానిని విశాఖ తరలించాలన్న జగన్ నిర్ణయాన్ని సాధ్యమైనంత వరకూ అడ్డుకునేందుకు చంద్రబాబు అనుకూల పత్రికలు ప్రయత్నిస్తున్నాయి. జగన్ ది ఎంత తుగ్లక్ నిర్ణయమో అంటూ ప్రత్యేక కథనాలు వండివారుస్తున్నాయి. దీనిపై వైసీపీ కూడా అదే స్థాయిలో ప్రతిఘటన చూపుతోంది. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఈనాడు పత్రికపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

 

బొత్స ఏమన్నారంటే..” ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈటీవీ, ఏబీఎన్‌ చానళ్లు ఇష్టారీతిగా వ్యవహరించడం బాధాకరం. ఈ రెండు పత్రికలు, చానళ్లు సమాజం కోసం ఆలోచన చేస్తున్నట్లుగా లేదని, వారి సామాజికవర్గం కోసం చేస్తున్నట్లుగా ఉంది. తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి. ఎన్నికల ముందు అమరావతికి డబ్బులు కావాలని రాసిన ఇదే ఈనాడు పత్రిక.. ఇవాళ డబ్బులు అవసరం లేదని రాసింది. రాజధాని విషయంలో శివరామకృష్ణన్‌ కమిటీ ఏం చెప్పిందో ఈనాడులో వేయగలరా.. అని బొత్స ప్రశ్నించారు. నో డౌట్ ఇక సమరమే..!

మరింత సమాచారం తెలుసుకోండి: