రాజధానికి రూ.లక్షా9వేలకోట్లు కావాలని చెప్పినట్లు ఆరోపిస్తున్న బొత్స, వాస్తవాలు తెలుసుకోవాలని టీడీపీ నేతలు అంటున్నారు. అమరావతి నిర్మాణానికి రూపాయికూడా ప్రభుత్వసొమ్ము అవసర  ం లేదన్నారు. రాజధాని భూములపై వచ్చే ఆదాయంతోనే అమరావతిని నిర్మించవచ్చ నని తెలుగుదేశం పార్టీ నేత గురజాల మాల్యాద్రి పేర్కొన్నారు . గతప్రభుత్వం రాజధానిపై రూ.10వేలకోట్లు ఖర్చుచేస్తే, అందులో ప్రభుత్వవాటా రూ.250కోట్లు మాత్రమేనని మాల్యాద్రి స్పష్టంచేశారు. రైతులిచ్చిన భూముల్లో నిర్మాణా లన్నింటికిపోగా, మిగిలిన 10వేల ఎకరాల నిల్వభూమి అమ్మకంద్వారా వచ్చే ఆదాయం తోనే దాదాపు రూ.లక్షా50వేలకోట్ల వరకు సమకూరుతాయని గురజాల వివరించారు. 

 

వైసీపీ ప్రభుత్వం రాకముందు రాజధానిప్రాంతంలో చదరపుగజం రూ.32వేలవరకు ఉందని, ఆవిధంగా చూసిన ఎకరం ధర రూ.15కోట్లని, 10వేలఎకరాలు అమ్మితే,  రూ.లక్షా50వేలకోట్ల ఆదాయం వచ్చేదన్నారు. రూ.లక్షకోట్లు రాజధాని నిర్మాణానికి ఖర్చుచేసినా, మిగిలిన రూ.50వేలకోట్లతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు   రూ.లక్షా50వేలకోట్ల ఆస్తిని చంద్రబాబు, జగన్‌చేతుల్లో పెడితే, దాన్ని సద్వినియోగం చేసుకోవడం చేతగాక టీడీపీపై నిందలు వేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం గడచిని ఐదేళ్లలో సాగునీటి రంగానికి రూ.74వేలకోట్లు ఖర్చుచేసిందని, 21ప్రాజెక్టులను  పూర్తిచేసి 32 లక్షల ఎకరాలకు నీటిని పారించడంకూడా జరిగిందన్నారు. ఒకవైపు అమరావతిని అభివృద్ధిచేస్తూనే, మరోవైపు సాగునీటిరంగానికి, సంక్షేమానికి నిధులు  వెచ్చించిన ఘనత తెలుగుదేశంప్రభుత్వానికే దక్కిందన్నారు. 7నెలల్లో రాజధానిపై రూపాయికూడా ఖర్చుచేయకుండా, సాగునీటిప్రాజెక్టుల్లో ఎక్కడా తట్టమట్టికూడా వేయ కుండా గతపాలకులపై విషం చిమ్మడమే వైసీపీప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు.  

 


ఇవన్నీ తెలిసికూడా మంత్రిస్థాయిలో ఉన్న బొత్స అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నా డన్నారు. హైదరాబాద్‌ -సైబరాబాద్‌ల నుంచి వచ్చే 60శాతం ఆదాయంతోనే తెలంగా ణలోని మిగిలిన జిల్లాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అలాంటి నగరం లేకుండా  13జిల్లాలు ఎలా అభివృద్ధి చెందుతాయో బొత్స సమాధానం చెప్పాలన్నారు. పొరుగు రాష్ట్రాలకు మేలుచేసేలా నిర్ణయాలు తీసకుంటూ, ఓట్లేసిన ప్రజల్ని పాలకులు  వంచిస్తున్నారని మాల్యాద్రి మండిపడ్డారు. ఆంధ్రా ముక్కలైతే, అక్కడ ఎవరూ పెట్టుబడు  లు పెట్టరనే ప్రచారం ఇప్పటికే పొరుగరాష్ట్రాల్లో ప్రారంభమైందన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: