అమ్మఒడి.. పిల్లలకు బడికి పంపించే పేద తల్లులకు జగన్ సర్కారు అందిస్తున్న కానుక ఇది. దీన్ని చిత్తూరులో జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆ తల్లులకు ఒక విజ్ఞప్తి చేశారు. మీకు ఇస్తున్న 15 వేల రూపాయల్లో ఒక్క వెయ్యి రూపాయలు వెనక్కి ఇవ్వండి.. అలా అంతా ఇచ్చిన డబ్బుతో స్కూలులో మౌలిక సదుపాయాలు కల్పించుకుందామని పిలుపు ఇచ్చారు.

 

జగన్ ఏమన్నారంటే.. “ అమ్మ ఒడి గురించి చివరిగా రెండే రెండు మాటలు..29 రాష్ట్రాల్లో, దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. మొట్ట మొదట మనమే. ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టుకు కట్టుబడి, పాదయాత్ర ముగిసింది కూడా ఇదే జనవరి 9న ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. రూ.15 వేలు ప్రతి తల్లికి తమ పిల్లల జీవితాలు బాగుపరిచేందుకు జగనన్న ఒక అన్నగా , తమ్ముడిగా అండగా ఉంటూ ఇస్తున్నాడు. ఆ పిల్లలకు మంచి మేనమామగా కూడా ఇస్తున్నారు. ఒక బాధ్యత కూడా గుర్తు చేస్తున్నాడు. రూ.15 వేలు తీసుకుంటున్న తల్లికి ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రతి స్కూల్‌ రూపురేఖలు మార్చుతున్నాం.

 

ప్రతి స్కూల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నాం. మీరు స్కూల్‌ పనితీరులో భాగస్వాములు కావాలి. ఆ స్కూల్‌ బాగుండేలా మీరంతా కూడా మమేకం కావాలి. ఇందుకోసమే పేరెంట్‌ కమిటీలు తెచ్చాం. ఇందులో నా విన్నపం. మీ బడుల్లో బాత్‌రూములు ఉంటాయి. స్కూళ్లకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మీ పిల్లలు వెళ్తున్న బాత్‌రూములపై కాస్త ధ్యాస పెట్టండి. మీ బడుల్లో ఉన్న బాత్‌రూమ్‌ల మెయింట్‌నెస్‌ కోరకు ఒక మనిషిని పెట్టుకుంటే జీతం రూ.4 వేలు, మెయింటెన్స్‌ కోసం మరో రూ.2 వేలు అవుతుంది. వాచ్‌మెన్‌ను పెట్టుకుంటే దానికి మరో రూ.4 వేలు ఖర్చు అవుతుంది. ఈ చిన్న సొమ్ములో మీరంతా భాగస్వాములు అయితే మీరు ప్రశ్నించవచ్చు.

 

మీ స్కూళ్లపై మీకు ఒనర్‌ షిప్‌ కూడా వస్తుంది. స్కూళ్లకు ఒక్క వెయ్యి రూపాయిలు సహాయం చేయగలిగితే..14 వేలు మీరే పెట్టుకోండి..కేవలం ఒక్క వెయ్యి రూపాయిలు ఇవ్వమని ఆ పిల్లల మేనమామగా అడుగుతున్నాం.. అని విజ్ఞప్తి చేశారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: