ప్రభుత్వ పాఠశాలలంటే ఎవరికీ పట్టవు.. పెచ్చులూడుతున్న గోడలు, పైకప్పులు, విరిగిన బల్లులు, నీళ్లు రాని చేతి పంపులు..ఇలా ఉంటాయి. కానీ ఇప్పుడు జగన్ సర్కారు వాటి తలరాత మార్చేస్తోంది. అమ్మ ఒడి ద్వారా ఇచ్చే 15 వేల రూపాయల్లో ఒక్క వెయ్యి రూపాయలు వెనక్కి ఇమ్మని అడగడం ద్వారా పాఠశాల నిధి ఏర్పాటవుతుంది. దాంతో స్కూలును బాగు చేసుకునే అవకాశం వచ్చింది.

 

అమ్మఒడి ప్రారంభోత్సవం సందర్భంగా ఇదే విజ్ఞప్తి చేసారు జగన్. “ మెయింటెనెన్స్‌లో ప్రజలు భాగస్వాములు కావాలి. ఈ కార్యక్రమం వల్ల పిల్లల జీవితాలు బాగుపడుతాయని పూర్తిగా విశ్వసిస్తూ.. ఇవాళ డబ్బులు జమా చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా ఈ పథకం వర్తించకపోతే ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు. అందరికి కూడా అవకాశం ఇస్తాం. మరో నెల రోజులు అవకాశం కల్పిస్తాం.

 

ఇంకా జగన్ ఏమన్నారంటే.. " మీరు స్కూల్‌ పనితీరులో భాగస్వాములు కావాలి. ఆ స్కూల్‌ బాగుండేలా మీరంతా కూడా మమేకం కావాలి. ఇందుకోసమే పేరెంట్‌ కమిటీలు తెచ్చాం. ఇందులో నా విన్నపం. మీ బడుల్లో బాత్‌రూములు ఉంటాయి. స్కూళ్లకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మీ పిల్లలు వెళ్తున్న బాత్‌రూములపై కాస్త ధ్యాస పెట్టండి. మీ బడుల్లో ఉన్న బాత్‌రూమ్‌ల మెయింట్‌నెస్‌ కోరకు ఒక మనిషిని పెట్టుకుంటే జీతం రూ.4 వేలు, మెయింటెన్స్‌ కోసం మరో రూ.2 వేలు అవుతుంది. వాచ్‌మెన్‌ను పెట్టుకుంటే దానికి మరో రూ.4 వేలు ఖర్చు అవుతుంది. ఈ చిన్న సొమ్ములో మీరంతా భాగస్వాములు అయితే మీరు ప్రశ్నించవచ్చు. మీ స్కూళ్లపై మీకు ఒనర్‌ షిప్‌ కూడా వస్తుంది.. అని సూచించారు జగన్.

 

ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకుంటే వాళ్లకు కూడా డబ్బులు జమా చేస్తాం. మీ గ్రామాల్లోని గ్రామ సచివాలయాలను ఉపయోగించుకోండి. గ్రామ వాలంటీర్‌ సహాయంతో ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకోండి. ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులతో నాకు ఇంకా బలం ఇవ్వాలని కోరుకుంటూ..ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలంటూ ముగించారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: