ఆంధ్రప్రదేశ్ లో బడి పిల్లలకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి పాఠశాలల మధ్యాహ్న భోజనం మెనూ మార్చేయబోతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో సిలబస్‌ మార్చుతున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో కూడా మెనూ మార్పు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు తీసుకురావాలని ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఒక్క జగన్‌ మాత్రమే .

 

రోజు ఇదే తిండేనా అని ఆ పిల్లల నోట్లో నుంచి రాకూడదన్నారు జగన్ . మొదటిసారిగా మోను కార్డు తయారు చేస్తున్నారు. ఎగ్‌ కర్రి, స్వీట్‌, చిక్కీ, పొంగల్‌ కూడా ఇవ్వబోతున్నారు. ఇలా రోజు మెనూలో మార్పు చేస్తున్నారు. ఏం పెడితే పిల్లలకు బాగుంటారో అని గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదన్నారు జగన్.

 

ఈ మార్పులు చేయడం వల్ల దాదాపుగా రూ.200 కోట్లు ఎక్కువైనా కూడా సంతోషంగా భరిస్తామన్నారు జగన్. ఆయాల గురించి ఆలోచన చేస్తున్నారు. గతంలో ముష్టి వేసినట్లు రూ.వెయ్యి ఇచ్చేవారు. సరుకుల బిల్లులు కూడా సకాలంలో ఇచ్చేవారు కాదు. వాళ్ల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచుతున్నారు. ఇందుకోసం రూ.150 కోట్లు భారం అవుతుంది.

 

ఈ మధ్య కాలంలో రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్రలో పిల్లల చదువుల గురించి ఇంతగా ఆలోచించే ఏ ముఖ్యమంత్రి ఎవరు ఉండరని జగన్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: