తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తంలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే పెరిగిన ఆర్టీసీ ఛార్జీలతో  ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. మొదటగా తెలంగాణ రాష్ట్రంలో పెంచగా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. తెలంగాణలో జరిగిన ఆర్టీసీ సమ్మె తో  ఆర్టీసీ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది అని  తెలిపిన తెలంగాణ సర్కార్.. ఆర్టీసీ చార్జీలు పెంచితే తప్ప ఆర్టీసీ మనుగడ సాధ్యం కాదని తెలిపింది. ఆర్టీసీ కార్మికులు అందరూ 50 రోజులు సమ్మె చేసి విరమించిన తర్వాత తెలంగాణ సర్కార్ ఆర్టీసీ కార్మికులు అందరికీ ఉద్యోగాలు లో చేర్చుకొని ఆర్టీసీ ఛార్జీల పెంపు చేపట్టింది. అయితే దీనిపై తెలంగాణ ప్రజలందరూ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మీరు మీరు బాగానే ఉన్నారు చివరికి భారం మాపైన వేశారు అంటూ తెలంగాణ ప్రజలు పెదవి విరిచారు. 

 

 

 ఇప్పటికే పెరిగిన చార్జీలతో తెలంగాణ ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. రోజు బస్ చార్జీలు కే తాము సంపాదించిన జీవితం మొత్తం అయిపోతుంది అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చార్జీల పెంపు తర్వాత చాలామంది ఆర్టీసీలో ప్రయాణం చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బస్సులో ఎక్కువగా ప్రయాణం చేసే వారికి ఈ ఛార్జీల భారం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే తాజాగా మరోసారి చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. తెలుగు రాష్ట్రాల్లో మేడారం జాతర ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం కు ప్రత్యేక బస్సులు కేటాయిస్తుంది తెలంగాణ సర్కార్. అయితే మేడారం జాతరకు వెళ్లేటప్పుడు బస్సు ఫుల్ గానే ఉన్నప్పటికీ జాతర పూర్తయ్యేంత వరకు అక్కడి నుంచి భక్తుల రాక ఉండదు కాబట్టి వచ్చేటప్పుడు మాత్రం ఖాళీగా రావాల్సి ఉంటుంది. 

 

 

 

 ఈ నేపథ్యంలో ఆర్టీసీకి తీవ్ర నష్టం కలుగుతుందని భావించిన తెలంగాణ సర్కార్ మరోసారి చార్జీల పెంపు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మేడారం జాతరకు వెళ్లే అన్ని ఆర్టిసి బస్సు చార్జీలను అదనంగా 50 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ధరల పట్టికను ఆర్టీసీ యాజమాన్యం విడుదల చేసింది. భక్తులను మేడారం జాతరలో వదిలిన తర్వాత తిరుగు ప్రయాణంలో బస్సులోనే ఖాళీగా పంపించాల్సి ఉండటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు అధికారులు. దీంతో మేడారం వెళ్లాలనుకునే ప్రజలపై మరింత భారం పడనుంది. భారీగా పెరిగిన ఛార్జీలతో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: