చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా ఓ విషయాన్ని వ్యూహాత్మకంగా  హైలైట్ చేస్తున్నారు.  అదేమిటంటే చంద్రబాబు, అమరావతి ఒకటే అని. అందుకనే మాజీ సిఎం ఎక్కడ మాట్లాడినా ’తనను ఏమన్నా తిట్టండి పడతాను, తనను బాధించండి అంతే కానీ అమరావతిని మాత్రం తరలించవద్దు’ అంటూ పదే పదే మాట్లాడుతున్నారు.  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అమరావతి సెంటిమెంటును జనాలందరిలోను రగల్చటానికి చంద్రబాబు, ఎల్లోమీడియా చాలా పెద్దగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిపోతోంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అమరావతిలో పెట్టిన పెట్టుబడుల కోసమే, రియల్ ఎస్టేట్ ధరలు పడిపోకుండా చూసుకోవటం కోసమే చంద్రబాబు, ఎల్లోమీడియా తీవ్రంగా కృషి చేస్తున్న విషయం బయటపడిపోతంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించగానే చంద్రబాబు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టిన కమ్మోరు, ప్రముఖులు, భూములు సంపాదించుకున్న ఎల్లోమీడియా నెత్తిన పెద్ద బండ పడింది.

 

అందుకనే చంద్రబాబు వెంటనే రాజధాని గ్రామాల్లో సెంటిమెంటు రగల్చటానికి చాలా అవస్తలు పడ్డారు. అయినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల్లోని రైతులు భూములిస్తే ఆందోళనలు జరుగుతున్నది కేవలం ఐదారు గ్రామాల్లో మాత్రమే. అంటే భూములిచ్చిన గ్రామాల్లోనే  చంద్రబాబు వ్యూహం వర్కవుటు కాలేదు. దాంతో లాభం లేదని గ్రహించి చిరవకు ఇతర ఊర్లమీద పడ్డారు. దానికి అమరావతి పరిరక్షణ కోసం జోలె పట్టినట్లు డ్రామాలు మొదలుపెట్టారు.

 

ఆందోళనల పేరుతో ఎన్నిరోజులు బతిమలాడినా ఏ రాజకీయ పార్టీ కూడా చంద్రబాబుతో కలిసిరాలేదు. అలాగే విద్యార్ధులను రోడ్లమీదకు రావాలని ఎన్నిసార్లు పిలుపిచ్చినా ఉపయోగం కనబడలేదు. దాంతో ఉద్యమాలపేరుతో అఖిల పక్ష కమిటిల పేరుతో చివరకు సామాజికవర్గాల ముసుగులో కొన్నిపార్టీలను చంద్రబాబు లాక్కున్నారు. ఇందులో భాగమే సిపిఐ చాలా యాక్టివ్ రోల్ తీసుకోవటం. అందుకనే రాష్ట్రమంతా తిరుగుతూ అమరావతి అంటే చంద్రబాబు, చంద్రబాబంటే అమరావతి అనే కలరింగ్ ఇస్తున్నారు. దాన్ని ఎల్లోమీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: