తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అతిపెద్ద జాతరగా మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరను పేర్కొంటారు.. గిరిజన జాతరగా చెప్పబడే ఈ జాతరను మొదట్లో ఒక గిరిజనులు మాత్రమే చేసుకునే వారు. క్రమక్రమంగా ఈ పండగను ఇప్పుడు ప్రతి హిందువు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చెత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.

 

 

ఇకపోతే సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలంగాణ ప్రజలు జరుపుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ‘తెలంగాణ కుంభమేళా’ గా వర్ణింపబడే ఈ జాతరకు రవాణ పెద్దమొత్తంలో అవసరం అవుతుంది.. ఇందుకు గాను మేడారం వెళ్లాలనుకునే భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా.. అక్కడికి వెళ్లాలనుకునే వారి కోసం బస్సు ఛార్జీల వివరాలను ప్రకటించింది. మొత్తం 23 లక్షల మందిని తరలించేలా లక్ష్యం పెట్టుకున్న ఆర్టీసీ.. ఇప్పుడున్న ఛార్జీలకు 50% అదనంగా ఛార్జీలు వసూలు చేయబోతుందని ఈ వివరాలను చూస్తే అర్ధం అవుతుంది..  

 

 

హైదరాబాద్ నుంచి మేడారం రూ.440.. ఖాజీపేట్ నుంచి రూ.190.. హన్మకొండ నుంచి రూ.190.. వరంగల్ నుంచి రూ.190... పరకాల నుంచి రూ.190... చిట్యాల నుంచి రూ.200.. ఘణపురం(ము) నుంచి రూ.140... భూపాలపల్లి నుంచి రూ.180.. కాటారం నుంచి రూ.210.. కాళేశ్వరం నుంచి రూ.260.. మహారాష్ట్ర సిరోంచ నుంచి రూ.300.. ఏటూర్ నాగారం నుంచి రూ.60.. కొత్తగూడ నుంచి రూ.240.. నర్సంపేట్ నుంచి రూ.190.. మహబూబాబాద్ నుంచి రూ.270.. తొర్రూర్ నుంచి రూ.280.. వర్ధన్నపేట్ నుంచి రూ.230..

 

 

స్టేషన్ ఘన్‌పూర్ నుంచి రూ.240.. జనగామ నుంచి రూ.280 వసూలు చేస్తారు. ఇకపోతే ఈ జాతర  ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలై, ఫిబ్రవరి 8న వన ప్రవేశంతో ముగియనుంది. ఫిబ్రవరి 5న సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఫిబ్రవరి 6న సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది. ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 8న దేవతల వన ప్రవేశం ఉంటుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: