తెలుగుదేశంపార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది.  అమరావతి తరలింపుపై చంద్రబాబునాయుడు పదే పదే మాట్లాడుతూ  జగన్మోహన్ రెడ్డి ప్రజాతీర్పును కోరాలి, ఎన్నికలకు వెళ్ళాలంటూ చేస్తున్న డిమాండ్ అందరు చూస్తున్నదే. రాజధానిని తరలించటానికి జగన్ కు ఎవరు అధికారం ఇచ్చారు ? అంటూ నిలదీస్తున్నారు.

 

రాజధానిని తరలించాలని డిసైడ్ అయిన జగన్ వెంటనే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై పార్టీలో కూడా చర్చ జరుగుతోందట.  రాజీనామాలు చేయాలని జగన్ ను డిమాండ్ చేసేబదులు చేసే రాజీనామాలేదో ముందు టిడిపి ఎంఎల్ఏలు చేసేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చు కదా ? అంటూ చర్చ మొదలైంది.

 

మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో  గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు ఎంఎల్ఏలు గెలిచారు. వీరిలో గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీకి దూరమయ్యారు. గుంటూరు వెస్ట్ ఎంఎల్ఏ మద్దాలి గిరిధర్ కూడా అదే బాటలో ఉన్నారు. అంటే ఇక మిగిలింది ఇద్దరు మాత్రమే. మరి వీళ్ళిద్దరూ రాజీనామాలు చేస్తారా ? లేకపోతే మిగిలిన 19 మంది ఎంఎల్ఏలూ రాజీనామాలు చేసేస్తారా ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

రాజీనామాల విషయంలో నిజానికి పార్టీలో జరుగుతున్న చర్చే చాలా కీలకంగా మారింది. జగన్ ను రాజీనామాలు చేయమని డిమాండ్ చేసేబదులు చేసే రాజీనామాలేదో తామే చేసేస్తే జగన్ పై ఒత్తిడి పెరుగుతుంది కదా  అని పార్టీలో చర్చ జరుగుతోంది. చూస్తుంటే  రాజీనామాల విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారా ? లేకపోతే జగన్నే రాజీనామా చేయమని డిమాండ్ చేస్తు కాలయాపన చేసేస్తారా ? అన్నదే అర్దం కావటం లేదు.  చంద్రబాబు చెప్పినా అసలు టిడిపి ఎంఎల్ఏలు రాజీనామాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారా అన్నది కూడా డౌటే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: