తిరుమల తిరుపతి దేవస్థానం.. ఒక ఆధ్యాత్మిక ధామం . భక్తులందరికీ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన స్వామిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విరాజిల్లుతూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి విచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకుని శ్రీ వారి కృపకు పునీతులవుతారు. ఏ సమయంలో అయినా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తేజో విరాజమానంగా విరాజిల్లుతున్న స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎప్పుడూ భారీగా తరలి వస్తుంటారు. స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక అసలు విషయానికి వస్తే... తిరుమల శ్రీవారి ఆలయంలో లక్షల విలువైన నగలు మాయమయ్యాయి అంటూ గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

 

 

 కాగా ఈ విషయం పెను సంచలనమే సృష్టించింది.అయితే తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో లక్షలాది రూపాయల విలువైన ఆభరణాలు మాయమైనట్లు వస్తున్న వార్తలు వాస్తవమేనని అధికారులు విచారణలో తేలింది. అయితే ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించి ఆరు నెలలు కాగా..  ఇప్పుడు బయటకు వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈవోగా శ్రీనివాసులు ఉన్న సమయంలో... స్వామివారి ఆభరణాలు కనిపించడం లేదు అంటూ వచ్చిన ఫిర్యాదుపై.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక కమిటీని విచారణకు నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ విచారణ జరిపి స్వామివారి లక్షల విలువచేసే నగలు మాయమైన మాట నిజమేనంటూ తేల్చేసింది. 

 

 

 తిరుమల తిరుపతి దేవస్థానం ట్రెజరీ ఏఈఓగా శ్రీనివాసులు ఉన్న సమయంలోనే ఈ నగలు మాయమైనట్లు టీటీడీ నియమించిన విచారణ కమిటీ పేర్కొంది. 5 కిలోల బరువు ఉన్న వెండి కిరీటం, బంగారు నాణాలు రెండు ఉంగరాలు నెక్లెస్ కనిపించకుండా పోయాయని.. కనిపించకుండా పోయిన ఆభరణాల విలువ ఏకంగా 7.36 వ లక్షలు ఉంటుందని అధికారులు తెలియజేశారు. అయితే ఈ కేసులో శ్రీనివాసులు దోషిగా నిరూపితమైన తర్వాత 2018 నుంచి ఆయన వేతనం నుంచి నెలకు 25 వేల రూపాయల చొప్పున రికవరీ చేస్తున్నారని విచారణ కమిటీ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: