తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో నిన్న ఉదయం కనిపించిన కరపత్రాలు స్థానికంగా కలకం రేపుతున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి మున్సిపాలిటీ చైర్ పర్సన్ అయితే బాగుంటుందంటూ పేర్కొన్న కరపత్రాలు పౌరసమాజం పేరుతో సూర్యాపేట జిల్లాలో డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. కరపత్రాలలో ఈ కోరిక ఎవరిది అనే విషయం స్పష్టంగా చెప్పకపోయినా సూర్యాపేట జిల్లా టీఆర్ ఎస్ పార్టీ నాయకులు రాధాకృష్ణ ప్రచురణ కర్తగా ఉన్నారు.
 
పౌరసమాజం పేరుతో ప్రచురించబడిన ఈ కరపత్రాల గురించే జిల్లాలో చర్చ జరుగుతోంది. జిల్లా అంతటా కరపత్రాల గురించి కలకలం రేగుతోన్నా మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం ఈ ప్రచారం గురించి స్పందించటం లేదు. అసలు ఈ కరపత్రాల వెనక ఆలోచన మంత్రిదా...? మంత్రి అనుచరులదా...? లేక ఎవరైనా ఈ కరపత్రాల వెనుక ఉన్నారా.....? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకటం లేదు. అధిస్థానం కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తోందా...? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. 
 
అధిష్టానం మనసులో కూడా ఇదే నిర్ణయం ఉంటే మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం డబ్బులు ఖర్చు పెట్టిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. జిల్లాలో జగదీష్ రెడ్డి సతీమణి చైర్ పర్సన్ కావాలని కరపత్రాలు పంపిణీ కావటంపై ఇన్నిరోజులు ఆ పదవి కోసం ఆశపడిన వారి నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ కరపత్రాల గురించి మంత్రి జగదీష్ రెడ్డి ఏం చెబుతారో అని ఇన్నిరోజులు పదవి కోసం ఆశపడిన నేతలు ఎదురు చూస్తున్నారు. 
 
మరోవైపు జగదీష్ రెడ్డికి మంత్రి పదవి వచ్చిన తరువాత సునీతా జగదీష్ రెడ్డి పలు ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొనటంతో పాటు యాక్టివ్ అయ్యారు. ఎస్ ఫౌండేషన్ ను సునీతా జగదీష్ రెడ్డి తన అత్తగారి పేరుతో స్థాపించారు. సంక్రాంతి ముగ్గుల పోటీలు, బతుకమ్మ ఉత్సవాలు మొదలైన కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. మరి మంత్రి సతీమణి కరపత్రాల్లోని డిమాండ్ మేరకు నిజంగానే మున్సిపల్ చైర్ పర్సన్ కానున్నారా...? లేదా...? అనే విషయం తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: