లోకేష్ అంటే ఒక అసమర్ధునిగా పార్టీలోనూ, జనాల్లోనూ ఒక రకమైన ముద్ర పడిపోయింది. ఆ ముద్రను చేరుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు.తెలుగుదేశం పార్టీకి కాబోయే రథసారధి అనే ప్రచారం ఊపందుకుంటున్నా లోకేశ్ నాయకత్వం అంగీకరించేందుకు సొంత పార్టీ నాయకులు సైతం అంగీకరించడంలేదు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి బయటకి వెళ్లిన వారంతా లోకేషన్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడంతో పాటు ఆయనవల్లే తెలుగుదేశం పార్టీకి ఈ దుస్థితి వచ్చింది అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు లోకేష్ కంటే చంద్రబాబు ను  తీవ్రంగా బాధపెడుతున్నాయి. 


ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా కష్టపడాల్సి వస్తోందని,  దీనంతటికీ కారణం లోకేష్ అనే అభిప్రాయం బాబు లో కూడా ఉంది. అందుకే క్షేత్రస్థాయిలో లోకేష్ కు మద్దతు లభించేలా కొత్త ఆలోచనలకు పదును పెట్టారు. ప్రస్తుతం ఏపీ రాజధాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ గట్టిగానే పోరాడుతోంది. ఈ ఉద్యమంలోకి లోకేష్ ను ఇప్పటికే తీసుకొచ్చినా ఆయనకు అనుకున్నంత రేంజ్ లో  గుర్తింపు రాకపోవడంతో ఆయనకు కు మీడియా కవరేజ్ మరింత పెరిగేలా కొద్దిరోజులుగా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నాడు.

 

 లోకేష్ ఎక్కడికి వెళ్లినా బాబు కు మించిన కవరేజ్ ఇస్తూ టీడీపీ అనుకూల మీడియా హడావిడి చేస్తోంది. రైతులతో కలిసి ధర్నాలో, పోరాటాల్లో పాల్గొంటూ లోకేష్ హడావుడి చేస్తున్నాడు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ఇలా అన్నిటిలోనూ లోకేష్ మైలేజ్ పెరిగేలా ఆయన అనుకూల మీడియా ప్రయత్నాలు చేస్తోంది. అదీకాకుండా రాజధాని ప్రాంతంలో టిడిపి ఎంత అభివృద్ధి చేసినా మంగళగిరిలో లోకేష్ ఓడిపోవడం ఇప్పటికీ టిడిపి జీర్ణించుకోలేకపోతోంది.

 

ప్రస్తుతం అమరావతిలో ప్రజా ఉద్యమం ఎగిసిపడుతోంది. ఈ ఉద్యమాన్ని లోకేష్ కు అనుకూలంగా మార్చి ఆయన ఇమేజ్ ను టీడీపీ అనుకూల మీడియా పెంచేలా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇది ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: